అన్వేషించండి

Tirumala Bramhosthavam: తిరుమలను ఆది వరాహక్షేత్రం అని ఎందుకు అంటారు.. అలా చేస్తేనే శ్రీవారి దర్శనంతో సత్ఫలితం!

Tirumala Bramhosthavam: తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పిలుస్తారు.. ఎందుకు శ్రీవారి పుష్కరిణిలో స్నానంచేయాలి... ఈ కథనం పూర్తిగా చదివి.. మరోసారి తిరుమల యాత్రను అలాగే సాగించండి.

Tirumala Laddu News: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొలువైన క్షేత్రం తిరుమల. ఈ పుణ్యక్షేత్రావికి మరో పేరు కూడా ఉంది.. అదేంటో తెలుసా.. ఆదివరాహ క్షేత్రం... అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం.! కోరిన కోర్కెలు తీర్చే కోదండరాయుడిగా కీర్తిస్తూ తిరుమల శ్రీవారిని శరణు అంటూ భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల శ్రీవారి కంటే ముందు పుష్కరిణి పక్కన కొలువైన శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారా.. అలా చేస్తేనే తిరుమల యాత్ర సత్ఫలితం ఇస్తుంది.

Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!

తిరుమలకు శ్రీవారు రాకమునుపే 
శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపంతో అవతరించాడు. హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు వరాహావతారంలో సంహరించిన తర్వాత సాధుసంరక్షణ చేయడానికి భూలోకంలోనే ఉండటానికి అంగీకరించి వేంకటాచలం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు. తిరుమల అప్పటినుంచే ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. పురాణాల ద్వారా మనకు వరాహ స్వామి వారే శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి స్థలం ఇచ్చారని... అందుకే ఆయనకు తొలి నైవేద్యం, తొలి దర్శనం చేసుకునే సాంప్రదాయం ఉందని తెలుస్తోంది.

వరాహ పుష్కరిణి
తిరుమల లో మీకు వరాహ పుష్కరిణి గురించి తెలుసా... అదే మనం తిరుమలలో పాప నాశనం కోసం స్నానాలు చేసే ప్రాంతం శ్రీవారి పుష్కరిణి. దీనినే వరాహపుష్కరిణి గా కూడా పిలుస్తారు. తిరుమల శ్రీవారి పుష్కరిణి మానవ నిర్మితం కాదు.. స్వయంవ్యక్తం. స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధి ఈ ఒక్క పుష్కరిణికే దక్కింది.  ఈ పుష్కరిణి గురించి వరాహ-మార్కండేయ వామన- స్కాంద - బ్రహ్మ - భవిష్యోత్తర పురాణాలు అభివర్ణిస్తున్నాయి.

Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!

వేంకటాచలంలో గల మూడుకోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని ప్రసిద్ధి. దివ్య తేజోపేతం, సుగంధభరితమైన ఈ పుష్కరిణి సర్వతీర్థాలకు ఉత్పత్తి స్థానమని, శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించకముందే ఆవిర్భవించిందని వరాహపురాణం ప్రతిపాదిస్తుంది. వరాహస్వామి నివాసం స్వామిపుష్కరిణీ పక్కనే ఉండడం వల్ల ఆయన ఆజ్ఞచేత గరుడుడు దీన్ని వైకుంఠం నుండి తీసుకొనివచ్చారని.. అందుకే  దీనికి వరాహపుష్కరిణి అనే పేరు వచ్చింది.

9 తీర్థాలతో పుష్కరిణి
తిరుమలకు వచ్చే భక్తులు తప్పకుండా స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేయాలని ఆశపడుతారు. ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు ఉన్నాయి. కుబేరతీర్థం, గాలవతీర్థం, మార్కండేయతీర్థం, అగ్నితీర్థం - యమతీర్థం, వశిష్ఠతీర్థం, వరుణతీర్థం, వాయుతీర్థం, సరస్వతీతీర్థం ప్రధానమైనవి. ఈ ఒక్క పుష్కరిణిలో స్నానం చేస్తే తొమ్మిది తీర్థాల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. 

Also Read: Tirumala laddu issue: తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈసారి మీరు కూడా తిరుమలకు వెళ్తే తప్పకుండా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి... వరహ స్వామివారిని దర్శించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి.

వెంకటేశ్వర వజ్రకవచం

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapuram News: అలిగిన టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే- గన్‌మెన్‌లను వెనక్కి పంపిన ప్రసాద్
అలిగిన టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే- గన్‌మెన్‌లను వెనక్కి పంపిన ప్రసాద్
TG DSC Results: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
SBI RD With SIP: సిప్‌-ఆర్‌డీ, ఎఫ్‌డీ-ఆర్‌డీ - ఒకే స్కీమ్‌తో రెండు ప్రయోజనాలు!
సిప్‌-ఆర్‌డీ, ఎఫ్‌డీ-ఆర్‌డీ - ఒకే స్కీమ్‌తో రెండు ప్రయోజనాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anantapuram News: అలిగిన టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే- గన్‌మెన్‌లను వెనక్కి పంపిన ప్రసాద్
అలిగిన టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే- గన్‌మెన్‌లను వెనక్కి పంపిన ప్రసాద్
TG DSC Results: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
SBI RD With SIP: సిప్‌-ఆర్‌డీ, ఎఫ్‌డీ-ఆర్‌డీ - ఒకే స్కీమ్‌తో రెండు ప్రయోజనాలు!
సిప్‌-ఆర్‌డీ, ఎఫ్‌డీ-ఆర్‌డీ - ఒకే స్కీమ్‌తో రెండు ప్రయోజనాలు!
HYDRA: రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
Tirumala Bramhosthavam: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Nepal Floods: నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం
నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం
Embed widget