Vijayawada KCR Flexis : కేసీఆర్ వీరాభిమానులుగా పవన్ ఫ్యాన్స్ ! కానీ యాంటీ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా ?
విజయవాడలో కేసీఆర్‌ను పొగుడుతూ పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదుతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు.
ఆంధ్రప్రదేశ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ( Pavan Kalyan Fans ) ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ( KCR ) వీరాభిమానులుగా మారారు. కేసీఆర్‌ను పొగుడుతూ పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో భీమ్లా నాయక్ ( Bheemla Nayak ) సినిమా సాఫీగా విడుదలయింది. ప్రభుత్వం ఆటంకాలు కల్పించలేదు. అంతే కాదు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.. అలాగే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా చాన్సిచ్చింది. కానీ ఏపీలో ( Andhra ) మాత్రం విడుదల చేయడానికే ఆటంకాలు ఎదురయ్యాయి. టిక్కెట్ రేట్లను పెంచి అమ్మితే సీజ్ చేస్తామని ముందుగానే నోటీసులు ఇవ్వడంతో చాలా ధియేటర్లలో సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు హర్టయ్యారు.
వివేకా తరహాలో మరికొన్ని హత్యలు - ఆపే శక్తి సీబీఐకే ! ఈ జోస్యం ఎవరిదంటే ?
విజయవాడలోని అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో సహకరిచారని అభిమానం పెంచుకుని ఫ్లెక్సీలు ( KCR Flexi ) ఏర్పాటు చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రలతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మధ్యలో కేటిఆర్, తలసాని, వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ చిత్రాలు కూడా ఉన్నాయి. కేసిఆర్ ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సిఎం సర్ ( Hatsoff KCR Sir ) అంటూ పోస్టింగ్ పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఒక్క సారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని ఈ ఫ్లెక్సీలో ఎక్కడా విమర్శించలేదు. కానీ పరోక్షంగా పంచ్‌లు ఈ ఫ్లెక్సీలో ఉన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) నేతలు అంచనాకు వచ్చారు.
పదవి ఇస్తే చెప్పుకోవడానికి నాకెందుకు సిగ్గు ? జగన్‌ను కలిసిన తర్వాత పోసాని కామెంట్ !
ఏపీ సీఎం ను కాకుండా పొరుగు రాష్ట్ర సీఎంను అభినందిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అంటే ఏపీ సీఎం తీరుపై నిరన వ్యక్తం చేయడమేనని చాలా మంది భావించారు. ఆంక్షల తో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్ గానే ఫ్లెక్సీల ఏర్పాటు చేశారనే అంచనాకు వచ్చారు. దీంతో కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నేతలు మున్సిపల్ సిబ్బంది దృష్టికి ఈ ఫ్లెక్సీ అంశాన్ని తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఎలాంటి అభ్యంతరమైన అంశాలు ఫ్లెక్సీలో లేనప్పటికీ తొలగించడం ఏమిటని పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇతర వైఎస్ఆర్‌సీపీ నేతల ఫ్లెక్సీలన్నీ అక్కడే ఉండటంతో కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్లెక్సీని తొలగించాలని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.