Posani : పదవి ఇస్తే చెప్పుకోవడానికి నాకెందుకు సిగ్గు ? జగన్‌ను కలిసిన తర్వాత పోసాని కామెంట్ !
అలీకి ఇచ్చినట్లుగా తనకు ఏ పదవి ఇవ్వడం లేదని పోసాని కృష్ణమురళి తెలిపారు. కుటుంబంతో సహా ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
సినీ నటుడు అలీకి ( Ali ) ప్రభుత్వం రాజ్యసభ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెబుతోందని తనకు కూడా ఓ పదవి ఇస్తారనడంలో వాస్తవం లేదని నటుడు పోసాని కృష్ణ మురళి ( Posani Krishna Murali ) స్పష్టం చేశారు. నిజంగా ఇస్తానని చెబితే చెప్పుకోవడానికే తనకేంటి సిగ్గని ఆయన మీడియాను ప్రశ్నించారు. ఇటీవల అలీ కుటుంబంతో సహా సీఎం జగన్‌ను ( CM jagan ) కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు రెండు వారాల్లో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి పంపించారు. అలీ కూడా అప్పుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీసు ( YSRCP Office ) నుంచి ప్రకటన వస్తుందని.. ఏ పదవి అనేది తనకు తెలియదన్నారు.
రాజ్యసభా ? వక్ఫ్ బోర్డు ఛైర్మనా ? అలీకి దక్కే పోస్టేది ?
అయితే అలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ ( Wakf Board Chairman ) పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో పోసాని కృష్ణ మురళి కూడా కుటుంబంతో సహా సీఎం జగన్‌ను కలిశారు. అయితే తనకు పదవి ప్రకటించే ఉద్దేశంతో అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని పోసాని ( Posani Family ) భేటీ తర్వాత మీడియాకు తెలిపారు. ఇటీవల తమ కుటుంబం కరోనా బారిన పడిందన్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరామని .. ఈ విషయం తెలిసి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి ఏఐజీ ఆస్పత్రికి ( AIG Hospital ) ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా సహకరించారన్నారు.
చాలా కాలంగా జగన్ తో ఉన్నా...త్వరలోనే గుడ్ న్యూస్
వారి సహకారంతో తాము కరోనా నుంచి కోలుకున్నామని అందుకే సీఎం జగన్‌ను కుటుంబసమేతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పామన్నారు. సినిమా టిక్కెట్ల అంశంపై తాను సీఎం జగన్‌తో చర్చించలేదని స్పష్టం చేశారు. భీమ్లా నాయక్ ( Bheemla Nayak ) విషయంలో ప్రభుత్వం సీఎం జగన్‌పై వస్తున్న విమర్శలపై కూడా పోసాని స్పందించారు. సీఎం జగన్‌పై నిందలు వేసిన వ్యక్తి భూమిలో వంద అడుగుల లోతుకు పాతుకుపోతాడని శాపం పెట్టారు. ఇటీవల సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బృందంలో పోసాని కూడా ఉన్నారు. ఆయన సమావేశంలో మాట్లాడిన వీడియోలు తర్వాత బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.