CPI Narayana : వివేకా తరహాలో మరికొన్ని హత్యలు - ఆపే శక్తి సీబీఐకే ! ఈ జోస్యం ఎవరిదంటే ?
ఏపీలో రాజకీయ హత్యలు జరగకుండా సీబీఐ చూడాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. వివేకా తరహాలోనే మరికొంత మందిని హత్య చేసే అవకాశం ఉందన్నారు.
సీపీఐ సీనియర్ నేతల నారాయణ ( CPI Narayana ) రాజకీయాల కోసం హత్యలు చేసే సంస్కృతి ఏపీలో పెరిగిపోతోందన్నారు. వైఎస్ వివేకాను చంపినట్లుగా భవిష్యత్‌లో హత్యలు జరుగుతాయని జోస్యం చెబుతున్నారు అలాగే ఉక్రెయిన్ సంక్షోభం.. టాలీవుడ్‌తో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా స్పందించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఇంకా రాజకీయ హత్యలు జరుగుతాయి !
ఆంధ్రప్రదేశ్‌లో వివేకానందరెడ్డి ( Viveka Murder ) తరహాలో మరిన్ని రాజకీయ హత్యలు చోటు చేసుకుంటాయని సీపీఐ నేత నారాయణ జోస్యం చెప్పారు. శనివారం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో అందరికీ అంతా అర్థమైపోయిందని ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Family ) కుటుంబం నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ రాజకీయ హత్యలు ఇంతటితో ఆగవని.. భవిష్యత్‌లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం హత్యలు జరుగుతాయన్నారు. వీటిని నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ హత్యలు జరగకుండ ాసీబీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
సొంత ప్రయోజనాల కోసమే చిరంజీవి టీమ్ కలిసింది !
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్‌ను కొంత మంది కలవడంపై స్పందించారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడం.. భీమ్లా నాయక్ ( Bheemla Nayak ) సినిమాకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించడాన్ని తప్పు పట్టారు. అయితే ముఖ్యమంత్రిని కలిసిన చిరంజీవి టీమ్ అందరూ వారి స్వలాభం కోసమే కలిశారు తప్ప సినీ పరిశ్రమ కోసం కాదని స్పష్టం చేశారు. కళారంగంపై ఏపీ ప్రభుత్వం పనికి మాలిన రాజకీయాలు ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నించారు.
విదేశాంగ మంత్రి పనికి మాలిన వ్యక్తి !
ఉక్రెయిన్ ( Ukraine War ) సంక్షోభం, అక్కడ భారతీయులు పడుతున్న ఇబ్బందులపైనా సీపీఐ నారాయణ స్పందించారు. రష్యా ( Russa ) ఉక్రెయిన్ ల మద్య యుద్దం జరుగుతుందని రెండు మూడు నెలల నుంచి జరుగుతుందన్నారు. కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. మన దేశం విద్యార్తులు ఎంతమంది ఉక్రెయిన్ లో చదువుతున్నారో కనుక్కుని తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. దేశ ఇంటలిజేన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిలయిందని విదేశాంగ మంత్రి పనికి మాలిన వాడని సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.