NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
ఎన్టీఆర్ తన తొలి కేబినెట్‌లోనే అవినీతి ఆరోపణలపై ఓమంత్రిని తొలగించారు. అవినీతి చేస్తే ఎవరినీ వదిలి పెట్టే వారు కాదు.
NTR Centenary Celebrations : పంజాబ్ ఆరోగ్య మంత్రి కాంట్రాక్టుల్లో ఒక్క శాతం కమిషన్ తీసుకుంటున్నారని తేలడంతో వెంటనే ఏసీబీ కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని సహించదని దీంతో తేలిపోయిందని చాలా మంది ప్రశంశలు కురిపించారు. నిజానికి సమకాలిన రాజకీయ పార్టీల్లో హత్యలు చేసిన సొంత పార్టీ నేతల్ని కూడా కాపాడేందుకే ఆయా అపార్టీల పెద్దలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా జైలుకు పంపించింది తక్కువే. అందుకే కాస్త విశేషంగా చెప్పుకుంటారు.
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
కానీ నాలుగు దశాబ్దాల క్రితమే ఇలా అవినీతి విషయంలో సొంత వాళ్లు.. పరాయి వాళ్లు అనే నిబంధన పెట్టుకోని నేత ఎన్టీఆర్. పార్టీ పెట్టి అదికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన పార్టీలో అందరూ కొత్త రాజకీయ నేతలే ఉండేవారు. మంత్రులు కూడా అందరూ కొత్తవారే. ఇలా ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా రామచంద్రరావు ఉండేవారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవినీతిని ఏ మాత్రం సహించని ఎన్టీఆర్ వెంటనే ఏసీబీతో సోదాలు చేయించారు. మంత్రి పదవి నుంచి రామచంద్రరావును తొలగించారు.
వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
అదే సమయంలో మరో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి కలర్ టీవీ కొనుగోలు చేశారు. మంత్రి అవగానే ఎలా కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీన్ని కూడా ఎన్టీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. అయితే జీవన్ రెడ్డి తాను అవినీతికి పాల్పడటం ద్వారా ఆ కలర్ టీవీ కొనుగోలు చేయలేదని.. వాయిదాల పద్దతిలో కొనుగోలు చేశానని ఆధారాలను ఎన్టీఆర్‌కు చూపించారు. దీంతో ఎన్టీఆర్ సంతృప్తి చెందారు. జీవన్ రెడ్డి పదవి కాపాడుకున్నారు.
చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
అవినీతికి , బంధుప్రీతి వంటి వాటికి ఎన్టీఆర్ ఆమడ దూరంలో ఉంటారు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందే ఆస్తులన్నీ పంచేశారు. తాను అధికారం చేపట్టిన తర్వాత కుటుంబసభ్యులెవరూ పాలనలో కానీ.. ప్రభుత్వంలో కానీ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఎవరూ ప్రభుత్వం నుంచి లబ్ది పొందే అవకాశం కూడా ఇవ్వలేదు. అలాగే సొంత పార్టీ నేతలు అవినీతికి పాల్పడినా వదిలి పెట్టే వారు కాదు.