Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Andhra : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అరగంట పాటు సమావేశమయ్యారు. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
Nagababu swearing in date has been finalized in Pawan Chandrababus meeting: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలో దాదాపుగా అరగంట పాటు సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యులను ఖరారును చేసినప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేసేందుకు పవన్ కల్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం
మంచి రోజలు చూసుకుని ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి ఓకే అన్నా అప్పుడు గవర్నర్ కు సమాచారం పంపుతానని చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం సీీఎం,డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడే ఖరారు చేద్దామని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగబాబుకు రాజ్యసభ సీటు వస్తుందని అనుకున్నారు. రాజీనామాల వల్ల ఖాళీ అయిన మూడు సీట్లలో ఒకటి జనసేనకు వస్తుందనుకున్నారు. కానీ రాజీనామా చేసిన ఆర్ .కృష్ణయ్య బీజేపీలో చేరడంతో ఆయనకే సీటివ్వాల్సి వచ్చింది.
Also Read : TDP: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
తాజా రాజకీయ అంశాలపైనా, కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద నాయకులను చేర్చుకుంటే అన్ని పార్టీల క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తున్నందున ఇప్పుడల్లా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారు వైసీపీకి రాజీనామా చేసి కొంత కాలం సైలెంట్ గా ఉన్న తర్వాత పార్టీలో చేరే అంశంపై చర్చించవచ్చని అనుకుంటున్నారు. అదే సమయంలో ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలోనూ ఇద్దరు నేతలు చర్చించినట్లుగా చెబుతున్నారు.
Also Read : Dhanurmasam : తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసం ప్రారంభం -తిరుమల సహా వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం
సాగునీటి సంఘాల ఎన్నికల్లో స్వీప్ చేయడంపై చర్చ
సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా కలసి పోటీ చేశారు. మంచి ఫలితాలు సాధించారు. వైసీపీ ఎన్నికల బహిష్కరణ చేయడంతో అన్నీ దాదాపుగా ఏకగ్రీవమయ్యాయి. త్వరలో జరగనున్ నసహకార సంఘాల ఎన్నికలు, అలాగే ఆ తర్వాత జరగనున్న పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాగే సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.