TDP: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Jogi Ramesh: టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతు శిరీష, మంత్రి పార్థసారధిలను లోకేష్ వివరణ అడిగారు.
Nara Lokesh expressed anger over Jogi Ramesh participation in TDP program: మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషలపై టీడీపీ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ మండిపడ్డారు. వారు నూజివీడులో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ ర్యాలీలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన పాల్గొనడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆయన కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పలు కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు.
ఇలా జోగి రమేష్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆ పార్టీ క్యాడర్ సీరియస్ గా స్పందించింది. దీనికి కారణం జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుఇంటిపై దాడికి వెళ్లారు. అలాగే టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. జోగి రమేష్ తీరు అత్యంత ఘోరంగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నేతలు మండిపడేవారు. తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేసేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకుంటున్నారని ఇంకెందుకు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా చేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.
నూజివీడు లో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి సారధి, గౌతు శిరీషలతో కలిసి ఒకటే వానులో జోగి రమేష్!
— Ravi Vallabhaneni (గెలిచేశాం ఘనంగా) (@ravivallabha) December 16, 2024
అంతా ఆ తానులో గుడ్డలే. మనమే వెర్రి వాళ్ళం!🤔
ఇది దేనికి సంకేతం అంటే రేపు జగన్, పవన్ లతో చంద్రబాబు గారు ఒకే వ్యాను లో తిరిగే రోజులు వస్తున్నాయ్ 🤔 🫢😵💫🥴🫨 pic.twitter.com/WeCwhINajV
టీడీపీ కార్యకర్తల ఆగ్రహం నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆసలేం జరిగిందో ఆయన ఆరా తీశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అనూహ్యంగా జోగి రమేష్ హాజరయ్యారు. ఆయనను ఎవరు పిలిచారన్నది బయటకు రాలేదు. నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పార్థసారధి ఉండటం, వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాల కారణంగా ఆహ్వానించి ఉంటారని భావిస్తున్నారు. సామాజికవర్గ పరంగా ఆలోచించి పిలిచి ఉంటారని ఈ ఇష్యూ ఇంత వరకూ వస్తుందని అనుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు.
Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
మరో వైపు జోగి రమేష్ పై కూడా వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనను జగన్ మైలవరం ఇంచార్జ్ గా నియమించి చాలా కాలం అయింది. అయితే ఆయన ఇంత వరకూ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.