News
News
వీడియోలు ఆటలు
X

చున్నీ లాగారని సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ ఫిర్యాదు- డీజీపీకి ఫోన్!

నంద్యాల టీడీపీలో వార్ మరింత ముదిరింది. ఓవైపు లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

లోకేష్ యువగళం నంద్యాల లోకి వస్తున్న టైంలో టీడీపీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. తన చున్నీ లాగినందుకు సుబ్బారెడ్డిపై దాడి జరిగిందని అంటున్నారు మాజీ మంత్రి అఖిల ప్రియ. ఆగ్రహంతో తన అనుచరులు ఆయనపై చేయి చేసుకున్నారని అంటున్నారామె. 

నంద్యాల టీడీపీలో వార్ మరింత ముదిరింది. ఓవైపు లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో అఖిల ప్రియను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు దానికి రియాక్షన్‌గా సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అఖిల ప్రియ. 

సుబ్బారెడ్డి తన చున్నీ లాగారని తీవ్ర ఆరోపణలు చేశారు అఖిలప్రియ. అందుకే అక్కడ గొడవ జరిగిందని... కొందరు అనుచరులు ఆయనపై చెయ్యి చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు డీజీపీతో మాట్లాడిన ఆమె... సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. 

నంద్యాల జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. లోకేష్ పాదయాత్ర నంద్యాలలోకి ప్రవేశించే క్రమంలో ఇరు వర్గాల మధ్య  మరోసారి వార్‌ షురూ అయింది. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. లోకేష్ పాదయాత్ర సాగుతున్న టైంలో ఈ గ్రూప్‌ వార్ టీడీపీకి తలనొప్పిగా మారుతుంది. 

ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుుడు తారాస్థాయి చేరుకున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఈ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. 

భూమా అఖిల ప్రియ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఏవీ సుబ్బారెడ్డిపై తిరగబడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి. లోకేష్‌ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా జరగడం టిడీపీ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. 

నారా లోకేష్ యువగళం యాత్రను నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే క్రమంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతల మధ్య సాగింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆయన్ని కొడుతున్న టైంలో పోలీసులు, ఆయన అనుచరులు ఆ దాడిని అడ్డుకున్నారు. స్వల్ప గాయాలతో సుబ్బారెడ్డి బయపడ్డారు. 

ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉన్నారు. సుబ్బారెడ్డిపై దాడి చేస్తున్న వ్యక్తిని మరో వ్యక్తి అడ్డుకుంటే ఆయన్ని కూడా చితక్కొట్టారు. ఇంతలో పోలీసులు వచ్చి సుబ్బారెడ్డిని పక్కకు తీసుకెళ్లడం విజువల్స్‌లో క్లియర్‌గా ఉంది. ఇరు వర్గాలను కూడా సర్దిచెబుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. 

తనపై జరిగిన దాడి కారణం అఖిల ప్రియ అంటున్నారు సుబ్బారెడ్డి. సత్తా ఉంటే డైరెక్ట్‌గా వచ్చి పోరాటం చేయాలని సవాల్ చేశారు. ఇరు వర్గాల ఘర్షణతో పాదయాత్రలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకొని సుబ్బారెడ్డిని అక్కడి నుంచి పంపేశారు. ఈ దాడితో అలర్ట్ అయిన పోలీసులు నంద్యాలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. 

సుబ్బారెడ్డి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ ఉదయం భూమా అఖిల ప్రియను అరెస్టు చేశారు. ఆమెతోపాటు భర్త భార్గవ్‌రామ్‌, పీఏ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు దాడికి కారణాలపై ఆరా తీస్తున్నారు. దాడిలో వారి పాత్రపై ప్రశ్నిస్తున్నారు. అయితే తన చున్నీ లాగారని సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ ఎదురు కేసు పెట్టడం ఈ వివాదం మరో స్థాయికి వెళ్లింది. 

Also Read:తిరుపతి‌ జిల్లాలో కామ‌ తాంత్రికుడు, సమస్యలు పోవాలంటే నగ్నంగా పూజలు చేయాలని బలవంతం!

Also Read:   ఎండలతో ఉడికిపోతున్న ఆంధ్ర, నేడు ఈ ప్రాంతాల్లో నిప్పుల కొలిమే - తెలంగాణలో ఇలా

Published at : 17 May 2023 10:45 AM (IST) Tags: Breaking News allagadda Nandyala Bhuma Akhila Priya ABP Desam TDP AV Subba Reddy

సంబంధిత కథనాలు

Nara Lokesh Padayatra: కడప జిల్లా లోకేష్ పాదయాత్రలో టెన్షన్ టెన్షన్- గురవారం పలుచోట్ల ఉద్రిక్తత

Nara Lokesh Padayatra: కడప జిల్లా లోకేష్ పాదయాత్రలో టెన్షన్ టెన్షన్- గురవారం పలుచోట్ల ఉద్రిక్తత

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు