అన్వేషించండి

Weather Latest Update: ఎండలతో ఉడికిపోతున్న ఆంధ్ర, నేడు ఈ ప్రాంతాల్లో నిప్పుల కొలిమే - తెలంగాణలో ఇలా

ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

తెలంగాణలో నేడు దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. 

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 41 శాతంగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం (మే 16) తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా  మద్దిపాడు మండలంలో 46.7 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా  కొత్తూరులో 46.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. పలు జిల్లాల్లో మొత్తంగా 13 మండలాల్లో 46 డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు.

రేపు (మే 17) 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు చెప్పారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మంగళవారం 40 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. క్షేత్రస్థాయిలో  ప్రజలకు  విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని అవి అందినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (20) :- అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1,  ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోవు మూడు రోజులు కింద విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు

మే 17 బుధవారం

• ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  44  డిగ్రీలు - 45 డిగ్రీలల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 
• విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీలు - 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే 18 గురువారం
• విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  43  డిగ్రీలు - 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు,  పశ్చిమ గోదావరి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీలు - 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే 19 శుక్రవారం 
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  44 డిగ్రీలు - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, SPSR నెల్లూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  42 డిగ్రీలు - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  40 డిగ్రీలు - 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా
దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతా పొడి వాతావరణమే ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల  సుమారుగా 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget