News
News
వీడియోలు ఆటలు
X

Tirupathi Crime News: తిరుపతి‌ జిల్లాలో కామ‌ తాంత్రికుడు, సమస్యలు పోవాలంటే నగ్నంగా పూజలు చేయాలని బలవంతం!

Tirupathi Crime News: నగ్నంగా పూజల్లో కూర్చుంటే ఆర్థిక, కుటుంబ సమస్యలు తీరుస్తానంటూ మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడేవాడు. చివరకు ఈ కామ తాంత్రికుడిని పోలీసులు పట్టుకున్నారు. 

FOLLOW US: 
Share:

Tirupati Crime News: తిరుపతి జిల్లాలో దొంగ పూజారులు రెచ్చి పోతున్నారు. అమాయకులైన వారిని టార్గెట్ చేసుకుని అందిన వరకూ దోచుకోవడంతో పాటుగా వారిపై లైంగిక దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో సుబ్బయ్య అనే పూజారి ఓ మహిళ మానసిక, ఆర్ధిక, కుటుంబ కలహాలు తీర్చుతానంటూ నమ్మించాడు. రోజూ తాంత్రిక పూజలు చేయిస్తూ.. చివరకు అత్యాచారానికి పాల్పడబోయాడు. కానీ చివరకు పోలీసులకు పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు నగ్నంగా ముగ్గుల్లో కూర్చోవాలని బలవంతం చేసిన పూజారికి ఆ మహిళ ఎలా షాక్ ఇచ్చిందంటే...???

శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్ పేటలో నివాసం ఉంటూ గత 15 సంవత్సరాలుగా తాంత్రిక పూజలు చేస్తూ.. సుబ్బయ్య జీవనం సాగిస్తున్నాడు. అయితే‌ సుబ్బయ్య గత కొంత కాలంగా తనకు తాంత్రిక విద్యలు తెలుసని చెబుతూ అమాయకులైన ప్రజలను మోసం చేయడంతోపాటుగా ఒంటరిగా ఉన్న మహిళలను లొంగ దీసుకుంటూ లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే రేణిగుంటకు చెందిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే క్రమంలో ఓ మహిళ చేత అడ్డంగా దొరికిపోయాడు సుబ్బయ్య. ప్రతీ మంగళ, శుక్ర, ఆదివారాల్లో తన ఇంటి వద్దకు వచ్చే బాధితులకు మంత్రాలు వేసి, తాయత్తులు కట్టి వాటితో జీవనం సాగిస్తున్నాడు సుబ్బయ్య. తాను చేసే దుర్మార్గపు పనులకు ఎవరూ అడ్డురారనే ధీమాతో తన వద్దకు వచ్చే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ముందుగానే వారి ఆర్థిక, మానసకి స్థితిగతులు తెలుసుకొని లొంగదీసుకునేవాడు. అంతేకాకుండా వారి పట్ల అసభ్యంగా, అనాలోచితంగా ప్రవర్తించేవాడు. ఇలా ఎంతో మంది మహిళలను ఇబ్బందులకు గురి చేశాడని సమాచారం. కానీ అవేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడేవాడు సుబ్బయ్య. 

Also Read: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

ఈ క్రమంలోనే రేణిగుంట ఎన్టీఆర్ కాలనీలో కాపురం ఉంటున్న హేమలత (30) భర్త ఈశ్వరయ్య (35) లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరికి పెళ్లి జరిగి 8 సంవత్సరాలు అవుతోంది. ఎంతో అన్యోన్యంగా వీరి కాపురం సాగేది. కానీ గత కొంత కాలంగా హేమలతకు తరచూ ఆరోగ్యం బాగుండట్లేదు. ఎంతో మంది వైద్యులకు చూపించినా తగ్గకపోవడంతో తనకు తెలిసిన వారు ఇచ్చిన సమాచారంతో.. శ్రీకాళహస్తిలోని మాంత్రికుడు సుబ్బయ్యను కలిసింది. తనకున్న అనారోగ్య సమస్యను తెలిపింది. తాంత్రికుడు సుబ్బయ్య బాధితురాలు హేమలత అనారోగ్య సమస్యను పోగొట్టాలంటే.. మీ ఇంట్లో అష్టదిగ్బంధనం చేయాలని, దానికి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అష్ట బంధనం చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని సుబ్బయ్య.. హేమలతను నమ్మించాడు. దీంతో హేమాలత తన ఆరోగ్యం కుదుటపడుతోందనే ఆశతో తాంత్రికుడు సుబ్బయ్యతో తాము పేద వాళ్లమని, తమ వద్ద అంత డబ్బు లేవని ప్రాధేయపడింది. దీంతో సుబ్బయ్య ఎలాగైనా వీరిని వదులుకో కూడదని చివరికి 22 వేల రూపాయలకు అష్ట దిగ్బంధనం చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకు అడ్వాన్సుగా 15 వేల రూపాయలను ముందుగానే హేమాలత ఫోన్ పే ద్వారా సుబ్బయ్యకు పంపింది.

అయితే ఈ పూజలు అర్థరాత్రి వేళ హేమాలత ఇంట్లోనే చేయాలని తెలిపాడు. దాంతో తమ ఇంట్లో చేసే పూజలే కదా అని హేమాలత తాంత్రికుడు సుబ్బయ్య మాటకు ఒప్పుకుంది. అష్టదిగ్భంధనం పూజలను చేయడానికి రేణిగుంటలోని హేమాలత ఇంటికి చేరుకున్న సుబ్బయ్య.. ఇంట్లో 4 మూలలా గుంతలు తవ్వి, ఆ తర్వాత నట్టింట ముగ్గు వేశాడు. ముందుగానే హేమలత ఇంట్లో తాను ఒక్కతే ఉండాలని హెచ్చరించాడు. అలాగే హేమాలతను పూజలో నగ్నంగా కూర్చోవాలని కోరాడు. వేంటనే హేమాలత నోట్లో నిమ్మకాయ పెట్టి కేకలు వేయనీకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత హేమాలతపై నెమ్మదిగా చేయి వేసి బలవంతం చేయపోయాడు. అయితే సుబ్బయ్య అసభ్య ప్రవర్తనను గుర్తించిన హేమలత సుబ్బయ్యను తోసేసింది. కానీ సుబ్బయ్య హేమలత మీదకు రాబోయాడు. దీంతో వీరిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో హేమాలత చేయి, వీపు భాగలపై తాంత్రికుడు చేతి గోళ్ల గాట్లు పడ్డాయి. దీనితో ఒక్కసారిగా తాంత్రికుడి చేష్టలకు నిర్ఘాంత పోయిన ఆమెను నిమ్మకాయ కోసే కత్తితో చంపేస్తానని కత్తి ఎత్తాడు. బాధితురాలు హేమలత భయపడి కేకలు వేయడంతో కాలనీలోని చుట్టు పక్కల వాళ్లు రావడంతో తాంత్రికుడు సుబ్బయ్య అసలు బండారం బయట పడింది.

అయితే బాధితురాలు హేమాలతపై సుబ్బయ్య చేస్తున్న బలవంతపు అఘాయిత్యానికి స్థానికులు కోపోద్రుక్తులై సుబ్బయ్యకు దేహశుద్ధి చేశారు. అనంతరం 100 డయల్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే సుబ్బయ్య పరారయ్యాడు. భాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టి మరీ నిందుతుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. తనకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయట పడవేస్తాడాని నమ్మి వచ్చిన బాధితురాలు హేమాలతకు.. సుబ్బయ్య వికృత చేష్టలు మానసిక ఆందోళనకు గురి చేసింది. ఇకనైనా పోలీస్  అధికారులు ఈ ఘటనపై స్పందించి తాంత్రికుడు సుబ్బయ్యకు కఠిన శిక్షలు వేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి బురిడీ బాబాలు వలలో మహిళలు చిక్కుకోకుండా చూడాలని, హేమాలత లాంటి అమాయకలు తాంత్రికులకు బలికాకుండా చూడాలని పలువురు రేణిగుంట వాసులు కోరుతూ ఉన్నారు.

Also Read: ఐదురోజుల పాటు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు - ఎప్పటి నుంచంటే?

Published at : 17 May 2023 10:18 AM (IST) Tags: AP Crime news Tirupati Crime News AP Latest Crime News Priest Accused Women Priest Molested Women

సంబంధిత కథనాలు

రాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే, హనుమంతుడు కూడా ఆదివాసీయే - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే, హనుమంతుడు కూడా ఆదివాసీయే - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

PNB SO Application: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!

PNB SO Application: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD

Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?