GVL : పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !
పోలవరం ఎత్తుపై జీవీఎల్ నరసింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో నిధులను కేంద్రం ఇస్తుందన్నారు.
GVL : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం త్వరలో రూ. 12 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. పోలవరంపై ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన తర్వాతి రోజే జీవీఎల్ నరసింహారావు ఈ ప్రకటన చేశారు. పోలవరం కోసం మొత్తంగా రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వబోతోందన్నారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మతుల కోసం ఈ నిధులు ఇస్తోందన్నారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన తెలిపారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందని ప్రకటించారు.
గుంటూరులో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్
ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఎంపీ జీవీఎల్.. తొమ్మిదేళ్ల కాలంలో రూ. 55 వేల కోట్ల మేర ఉపాధి హమీ నిధులు ఇచ్చారన్నారు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ధి మరెవరికీ చేకూర్చలేదన్నారు. రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారన్నారు. స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారని ఆయన చెప్పారు. ఈ రూ. 10 వేల కోట్ల నిధులు ఏపీ ప్రజలకు వరమన్నారు. రాష్ట్రం ఈ నిధులను కేంద్రం నుంచి గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోందని ఆయన మండిపడ్డారు. మేం నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
కడప జిల్లా లోకేష్ పాదయాత్రలో టెన్షన్ టెన్షన్- గురవారం పలుచోట్ల ఉద్రిక్తత
2016 నుంచి ఇప్పటి వరకు రూ. 16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయన్నారు. దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించిందని ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించిందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ. 5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించామని ఈ సందర్భంగా చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వ మారిన తర్వతా కాంట్రాక్టర్ ను మార్చడంతో పనులు స్లో అయ్యాయి. అదే సమయంలో సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదముద్ర వేయలేదు. మొన్నటిదాకా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చి.. ఇప్పుడు 2025 జూన్‌కు పూర్తవుతుందని అంటోంది. 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేసి. 2025 జూన్ నాటికి గానీ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా పోలవరం ఎత్తును అధికారికంగా తగ్గించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.