News
News
వీడియోలు ఆటలు
X

CM Jagan Volunteers : వాలంటీర్లపైనే జగన్ ఎక్కున నమ్మకం పెట్టుకున్నారా ? లీడర్లను చేస్తానన్న హామీ దేని కోసం ?

పార్టీ క్యాడర్ కన్నా వాలంటీర్లపైనే సీఎం జగన్ ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారా ? ప్రభుత్వం గురించి చెప్పాలని ఎందుకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ?

FOLLOW US: 
Share:

CM Jagan Volunteers :   ప్రభుత్వం గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరగడానికి .. వారికి ప్రభుత్వం చేస్తున్న మేళ్లు గురించి వివరించడానికి వాలంటీర్లు ముందు ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగన్ మాటలు వింటే ఆయన వైసీపీ క్యాడర్ కన్నా ఎక్కువగా వాలంటీర్లపై నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వంలోనూ వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వ పథకాలు నేరుగా ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారని..  25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్‌ అంబాసిడర్లు వాలంటీర్లేనని సీఎం జగన్ అంటున్నారు.  

వాలంటీర్లను లీడర్లను చేస్తానని జగన్ హామీ 

5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారధులు వాలంటీర్లు అని.. ప్రతి గడపకూ నేరుగా వాలంటీర్లే మనకున్న బలం అని నేరుగా చెప్పారు.  ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారని..  ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్‌కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులని..  వాలంటీర్‌ కార్యక్రమం మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని జగన్ హామీ ఇచ్చారు.  వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పట్లోనే తాను  లీడర్లుగా చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఆ మాటను గుర్తు పెట్టుకోవాల నిసూచించారు.  

ప్రభుత్వం చేసిన మంచినీ ప్రతీ ఇంటికి ప్రచారం చేయాలని పిలుపు            
  
జగనన్న సైన్యం వాలంటీర్లని..  ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలని జగన్ కోరారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలన్నారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదేనని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ వాలంటీర్లే తమ ప్రభుత్వం గురించి  ప్రజలకు చెబుతారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు . పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పెద్దగా పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు సీఎం జగన్ పై ఉన్నాయి. ఇప్పుడు ఆయన  వాలంటీర్లపై పెట్టుకున్న నమ్మకం కూడా అలాగే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                           

వాలంటీర్లే కీలకంగా సీఎం జగన్ నమ్మకం                                  

వాలంటీర్ల వద్ద ప్రతి యాభై ఇళ్లకు సంబంధించిన సమాచారం ఉంటుది. వారికి ప్రభుత్వం ఆ యాభై ఇళ్ల పరిధిలో లబ్దిదారులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు పథకాల్లో పేర్లు ఉంచాలా తీసెయ్యాలా అనే అధికారం కూడా ఇచ్చారు. దీంతో వాలంటీర్లు చెప్పినట్లుగా ఓట్లు వేస్తారన్న అభిప్రాయం సీఎం జగన్ లో ఉందని.. పార్టీ నేతల చెప్పిన దాని కన్నా వాలంటీర్లు చెబితే ఎక్కువ ప్రభావితం అవుతారని భావిస్తున్నారు. అందుకే వాలంటీర్లపై నమ్మకం పెంచుకున్నారని చెబుతున్నారు.  

Also Read: ఆక్వాలో 3,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

Also Read: తులసి మొక్కలాంటిది ఈ వాలంటీర్ వ్యవస్థ: సీఎం జగన్ 

Published at : 19 May 2023 01:52 PM (IST) Tags: AP Politics CM Jagan salute to volunteers Jagan's appeal to volunteers

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Mini Jamili Elections :  మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!