News
News
వీడియోలు ఆటలు
X

తులసి మొక్కలాంటిది ఈ వాలంటీర్ వ్యవస్థ: సీఎం జగన్

దేశంలో ఎక్కడ చూసినా గతంలో చూడని విధంగా రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికి సంక్షేమ సారథులు, వారధులు వాలంటీర్లేనన్నారు సీఎం జగన్. మంచి చేసే ప్రభుత్వానికి వాళ్లే సైన్యం అన్నారు.

FOLLOW US: 
Share:

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ, ప్రభుత్వం నచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన సైన్యమే 2లక్షల 66 వేల మంది వాలంటీర్లు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు మంచి చేయాలని తాపత్రయంతో 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హత మాత్రమే ప్రమాణికంగా లంచాలు లేకుండా అడుగులు వేస్తున్న సైన్యమన్నారు. జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లేనన్నారు. 

దేశంలో ఎక్కడ చూసినా గతంలో చూడని విధంగా రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికి సంక్షేమ సారథులు, వారధులు వాలంటీర్లేనన్నారు. ఇవాళ తీసుకొస్తున్న మార్పులకు సాక్ష్యాలు కూడా వాలంటీర్లేనన్నారు. ఇవాళ దాదాపు 90 శాతం గడపలకు వెళ్లి సంక్షేమాలపై ఫీడ్‌ బ్యాక్ తీసుకుంటున్న వ్యవస్థ కూడా అదే అన్నారు. ఇప్పుడు ఇస్తున్న పథకాలు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా అని అడగే నైతికత మీదే అని చెప్పారు. గతంలో జన్మభూమి అరాచకాలు చూశారని... అలాంటి అరచకాలు లేకుండా వాటి స్థానంలో తీసుకొచ్చిన తులసి మొక్కలాంటి వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. దీని పని తీరును వివరించే నైతికత కూడా వాటంటీర్లకే ఉందన్నారు. 

ప్రతి ఒక్కరికీ నిజాలు చెప్పే బాధ్యత వాలంటీర్లకే ఉందన్నారు జగన్. అమలు చేస్తున్న పథకాన్ని తీసుకున్నా వాలంటర్ల చేతుల మీదుగానే ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. 25 రకాల పథకాలకు బ్రాండ్‌ అంబాజిడర్‌లుగా ప్రతి ఇంటికి వెళ్తున్నారన్నారు. 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి చేర్చిన ఘనత వాలంటీర్లదేనన్నారు. 

ఇవి ఓర్వలేక... ఏ మంచి చేసిన చరిత్ర లేని వారు ఎన్నెన్ని అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. పని గట్టుకొని ఎలా దుష్ప్రాచారం చేస్తున్నారో చూస్తున్నామని అన్నారు. ఇలాంటి అన్యాయమైన రాజకీయాల మధ్య నిల్చొని ఉన్నామని తెలిపారు. పేదల ప్రభుత్వంపై గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తూ... నిందలు వేస్తే 5 కోట్ల ప్రజల ప్రతి గడపకు వెళ్లి నిజాలు చెప్పే సత్య సారథులు వాలంటీర్లేనన్నారు. మంచి చేశాం కాబట్టి ప్రతి గడపకు వెళ్లి వారితో మాట్లాడి మంచి జరిగిందా లేదని నీతిగా అడిగే నైతికత ఉందని అది మీ వల్లే సాధ్యమైందన్నారు.  

ఈ ప్రభుత్వ ఫిలాసిపీకి ప్రతిరూపం మీరేనన్నారు. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తున్నది సేవ మాత్రమేనన్నారు. ఇది ప్రభుత్వం ఉద్యోగం కాదన్న జగన్... అందుకే వాలంటీర్‌ అని పేరు పెట్టామన్నారు. ఎవరైనా మిమ్మల్ని ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని అంటే మాత్రం గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. 

మీ సేవలకు ఇచ్చే అవార్డు కార్యక్రమం మూడో ఏడాది కూడా ఇస్తున్నామని తెలిపారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో పది రోజుల పాటు జరిగే సత్కారాలు ప్రారంభిస్తాన్నామన్నారు. ప్రభుత్వం తరపున ఈ ఏడాది 239కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు మూడేళ్లుగా 705 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. 

వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి చంద్రబాబు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్‌ వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు కడుపు మంట అని అన్నారు. డజనుర జెలసిల్‌ మాత్రలు వేసినా తగ్గదని ఎద్దేవా చేశారు. అందుకే వాలంటీర్లు వ్యవస్థ రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామని కూడా అన్నారన్నారు. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే సీఎంకు కచ్చితంగా వాలంటీర్లు బ్రాండ్ అంబాజిడర్లు అని చెప్పారు. 

Published at : 19 May 2023 12:05 PM (IST) Tags: YSRCP Volunteers Jagan

సంబంధిత కథనాలు

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Minister Peddireddy: ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

AP Minister Peddireddy: ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?