Dalit leaders oppose Jagan: అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
Protest Against Jagan: అనకాపల్లి పర్యటనలో జగన్ కు దళితులు నిరసన తెలిపారు. డాక్టర్ సుధాకర్ మరణానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Anakapalle Dalits protest against Jagan: జగన్ నర్సీపట్నం పర్యటనలో దళిత సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. కోవిడ్ సమయంలో మాస్క్, పీపీఈ కిట్ అడిగినందుకు అవమానితులై మరణించిన దళిత వైద్యుడు డా. సుధాకర్ కుటుంబానికి జగన్ ప్రజ్వలంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నర్సీపట్నంలో డా. సుధాకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ నర్సీపట్నం పర్యటనను నిరసిస్తూ "గోబ్యాక్ జగన్" నినాదాలతో దళిత సంఘాలు భారీ మానవ హారం నిర్వహించాయి. జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని అన్యాయంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
.@ysjagan నర్సీపట్నం పర్యటనను నిరసిస్తూ "గోబ్యాక్ జగన్" నినాదాలతో దళిత సంఘాలు భారీ మానవ హారం నిర్వహించాయి.
— Telugu Desam Party (@JaiTDP) October 9, 2025
జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని అన్యాయంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.… pic.twitter.com/ZY79wHRRMr
జగన్ అనకాపల్లికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్గంలో చాలా చోట్ల జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్షమాపణ చెప్పకపోతే అడ్డుకుంటామని ప్రకటించారు.
ఈ ప్రశ్నకు సమాధానం ఉందా @ysjagan గారు?
— Venugopalreddy Chenchu (NRITDP Spokesperson) (@venuchenchu) October 9, 2025
జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ!!
డా.సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న దళిత సంఘాలు .
క్షమాపణ చెప్పకపోతే పర్యటన అడ్డుకుంటామని నిన్న హెచ్చరించిన దళిత సంఘాలు.
డాక్టర్ సుధాకర్ కు అవమానం జరిగిందంటూ… pic.twitter.com/2KnOCJu9Qj
దళిత సంఘాల ఆందోళనతో పోలీసులు జగన్ పర్యటనలో భద్రత పెంచారు. డా. సుధాకర్, దళిత వర్గానికి చెందిన వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో (2020-2024) కోవిడ్ మహమ్మారి సమయంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీలో పనిచేశారు. . పీపీఈ కిట్, మాస్క్‌లు ఇవ్వలేదని ఓ సమావేశంలో ప్రశ్నించడంతో ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. ఓ సందర్భంలో ఆయనను రోడ్డు మీద బట్టలు విప్పతీసి.. చేతులు విరిచికట్టి .. పిచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు పిచ్చి పట్టిందని వాదించారు. ఈ అంశంపై హైకోర్టు సీబీఐ విచారణకు కూడా ఆదేశించిది. "ఒక వైద్యుడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్లు, మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పి ఎవరిని మోసం చేస్తారు?" అంటూ దళిత నేతలు ప్రశ్నించారు.
జగన్ రోత రాజకీయాలను ఛీ కొట్టిన నర్సీపట్నం వైసీపీ శ్రేణులు
— Telugu Desam Party (@JaiTDP) October 9, 2025
దళిత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుండా, కట్టని మెడికల్ కాలేజీల గురించి జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాం అని, వైసీపీకి రాజీనామా చేసిన వెయ్యి మంది వైసీపీ కార్యకర్తలు.. వైసిపి… pic.twitter.com/0pHN91pLnz





















