Cm Jagan: రేపట్నుంచి సీఎం జగన్ కడప జిల్లా టూర్... ఈ నెల 25న పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు
సీఎం జగన్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న పులివెందుల ఈఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పార్థనల్లో సీఎం పాల్గొంటారు.
![Cm Jagan: రేపట్నుంచి సీఎం జగన్ కడప జిల్లా టూర్... ఈ నెల 25న పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు Cm Jagan mohan reddy kadapa tour attends Christmas celebrations Cm Jagan: రేపట్నుంచి సీఎం జగన్ కడప జిల్లా టూర్... ఈ నెల 25న పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/2155887b40d3dffca95cae55075fbb41_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సీఎం జగన్ రేపట్నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు కడప జిల్లాలో పలు కార్యక్రమాలు, క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ నెల 23 ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున బొల్లవరం, బద్వేలు, కొప్పర్తిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 24న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇడుపులపాయ ప్రార్థన మందిరంలో జరిగే ప్రార్థనలకు సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
Also Read: అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు అన్నీ సీసాలోకి ఎక్కిం చేస్తాడు
క్రిస్మస్ వేడుకలకు హాజరు
ఇక ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల ఈఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విజయాగార్డెన్స్ లో సారెడ్డి వరప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యుల పెళ్లి రిసెప్షన్ కు హాజరుకానున్నారు. ఆపై భాకరాపురంలోని సొంత నివాసానికి వెళ్లి కాసేపు విశ్రమించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం తిరుగుపయనమవుతారు.
Also Read: నెల్లూరులో భారీ స్కామ్, అసలు వాహనాలే లేవు.. అయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఎలా జరిగిందంటే..
వాహనాలు దారి మళ్లింపు
సీఎం జగన్ మూడు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని కడప జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు నుంచి బద్వేలు వైపు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు మినహాయించి ఇతర వాహనాలను దారిమళ్లించనున్నట్టు వివరించారు. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇతర జిల్లాలకు వెళ్లే లారీలు, కార్లు, ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎస్పీ సూచించారు. నెల్లూరు జిల్లాకు వెళ్లేవారు రాజంపేట, చిట్వేల్ మీదుగా వెళ్లొచ్చని ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లేవారు పోరుమామిళ్ల మీదుగా వెళ్లొచ్చని పేర్కొన్నారు. నెల్లూరు వెళ్లాలనుకునేవారు, నెల్లూరు నుంచి బద్వేలు కు రావాలనుకునేవారు శ్రీనివాసపురం, గోపవరం, లింగసముద్రం, బేతాయపల్లి, బెడుసుమల్లి, పీపీ కుంట మీదుగా నెల్లూరు వెళ్లొచ్చని తెలిపారు.
Also Read:చంద్రబాబు క్షమించినా ... నేను వదలను.. వైఎస్‌ఆర్‌సీపీ లీడర్స్‌కు లోకేష్ మాస్ వార్నింగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)