Nara Lokesh : చంద్రబాబు క్షమించినా ... నేను వదలను.. వైఎస్‌ఆర్‌సీపీ లీడర్స్‌కు లోకేష్ మాస్ వార్నింగ్
తన తల్లిని కించ పర్చిన వారు క్షమాపణలు చెప్పారని చంద్రబాబు క్షమించినా తాను మాత్రం లెక్క చూడకుండా వదిలి పెట్టనని నారా లోకేష్ హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.
నా తల్లిని కించ పర్చిన ఎవరినీ వదిలి పెట్టబోమని నారా లోకేష్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి లెక్కలూ తేల్చేస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కొద్ది రోజులుగా లోకేష్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రకటనలపై స్పందించారు. వరద బాధితుల్ని ఆదుకుంటున్నా కనీసం మనుషుల్లా ప్రవర్తించకుండా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నా.. అవమానించడం ఎంటంటూ ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఏదో ఒక విషయంలో బయటి లాగటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ విమర్శించారు. ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారంతా రానున్న కాలంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయించిన ఈ ప్రభుత్వం.. నేడు సొంతపార్టీ వాళ్ల మీద దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Nellore Artist: అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు అన్నీ సీసాలోకి ఎక్కిం చేస్తాడు
అసెంబ్లీ పరిణామాల తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు క్షమాపణలు చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీవీ చానళ్ల ముందుకు వచ్చి తప్పయిపోయిందని.. ఆవేశంలో నోరు జారానని చెప్పారు. ఆ తర్వాత వంశీతో వైఎస్ఆర్‌సీపీకి సంబంధం లేదని.. ఆయన తమ పార్టీలో చేరలేదని అధికార పార్టీ నేతలు వాదిస్తూ వస్తున్నారు. ఇక అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించలేదని.. చంద్రబాబు అనని మాటలను అన్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోరని.. ఆయన మనస్థత్వం అది కాదన్న ప్రచారం టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఈ అంశంపై కూడా లోకేష్ స్పందించారు. తన తండ్రి క్షమించినా... ఈ విషయంలో తాను మాత్రం క్షమించబోనని.. ప్రతీకారం ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిణామాలపై లోకేష్ ఇప్పటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. తొలి సారి.. తన తల్లిని కించ పరిచిన వారందరీ లెక్కలు తేలుస్తామని చెప్పడంతో ఏపీ రాజకీయాలు ముందు ముందు కూడా ప్రతీకార ధోరణిలోనే ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: jagan CBI Court : అందుకే సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు..మెమో సమర్పించిన సీఎం జగన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి