AP Liquor Shops: మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్... అర్ధరాత్రి వరకూ షాపులు ఓపెన్... ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా బార్లు, రీటైల్ మద్యం దుకాణాలలో రాత్రి 12 వరకూ మద్యం విక్రమాలకు అనుమతి ఇచ్చింది.
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్ లలో మద్యం అమ్మకాల సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకూ మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లలో మద్యం విక్రయానికి అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీచేశారు.
అర్ధరాత్రి 12 వరకూ అనుమతి
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని డిసెంబరు 31న అర్ధరాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచి ఉంచేలా ఎక్సైజ్‌శాఖ అనుమతులు ఇచ్చింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని తెలిపింది. ఈ మేరకు ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ అన్ని డిపోల మేనేజర్లకు గురువారం ఆదేశాలు ఇచ్చారు.
Also Read: అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులేమీ లేవు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్
ఏపీలో న్యూ ఇయర్ ఆంక్షలు
ఏపీలోని ప్రధాన నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. నిబంధనల మేరకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించింది. విశాఖ, విజయవాడల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి విజయవాడలో వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఇండోర్ వేడుకలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకోవద్దని సూచించారు. బెజవాడలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు సీపీ క్రాంతి రాణా తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా రోడ్లపైకి వచ్చి హడావుడి చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం ఉందన్నారు. అలాగే క్లబ్‌లు, రెస్టారెంట్లలో 60 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే వేడుకలకు అనుమతి ఇచ్చారు. రెస్టారెట్లు, క్లబ్‌లు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. డీజేలు, భారీ స్పీకర్లకు అనుమతి లేదని సీపీ తెలిపారు. విజయవాడ వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
Also Read: సోము వీర్రాజుకు కింగ్ జార్జ్ పేరూ నచ్చలేదు ..కేజీహెచ్ పేరు మార్చాలని డిమాండ్!
విశాఖలో
నగరంలోని ప్రధాన రహదారులైన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్రోడ్లలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్, పీసీఆర్ఫ్లై ఓవర్‌లపై వాహనాలకు అనుమతిలేదని ప్రకటించారు. విశాఖ బీచ్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలపై నిషేధం విధించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బీఆర్‌టీఎస్ సెంటర్ లైన్ రోడ్ మూసివేస్తారు. నగరంలో కేక్ కటింగ్‌లు, డీజేలపై కూడా నిషేధం ఉందని విశాఖ పోలీసులు తెలిపారు.
Also Read: అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా ? అప్పు కోసమా ? నిజంగానే పూర్తి చేస్తారా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి