Ysrcp Mla Sridevi: అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులేమీ లేవు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులు ఏంలేవని ఆమె మాట్లాడడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అంబేడ్కర్ పై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను ఉద్దేశించి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రపంచ మాదిగ దినోత్సవ ప్లీనరీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్ వల్ల మాదిగలకు వచ్చిందేమీ లేదన్నారు. అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులు ఏమీ లేవని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాస్తే దానిని సక్రమంగా అమలు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మాదిగలకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాబూ జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు శ్రీదేవి వ్యాఖ్యలపై అంబేడ్కర్ అభిమానులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: సోము వీర్రాజుకు కింగ్ జార్జ్ పేరూ నచ్చలేదు ..కేజీహెచ్ పేరు మార్చాలని డిమాండ్!
ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను విమర్శిస్తూ ఎమ్మెల్యే శ్రీదేవి ఇలా మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అంబేడ్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రామ్ వల్ల సాధ్యమయ్యాయని శ్రీదేవి అన్నారు. మాదిగలకు రాజ్యాంగ హక్కులు వచ్చాయంటే దానికి కారణం బాబూ జగ్జీవన్ రామ్ అని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా గతంలోనూ వినాయకుడిపై ఎమ్మెల్యే శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా ? అప్పు కోసమా ? నిజంగానే పూర్తి చేస్తారా
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వర్ల రామయ్య ఫైర్
ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై అంబేడ్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వర్ల రామయ్య మాట్లాడుతూ ముందు నుంచి అంబేడ్కర్ అంటే వైసీపీ నేతలు అయిష్టత చూపిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ ను వైసీపీ నేతలు కించపర్చడం చాలా సార్లు చూశామని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి అంబేడ్కర్ ను కించపరుస్తూ మాట్లాడారన్నారని ఆరోపించారు. తక్షణం ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కోనసీమ మాలమహానాడు ధర్నా
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో 216 జాతీయ రహదారిపై పేరూరు వై జంక్షన్ వద్ద కోనసీమ మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజమండ్రిలో నిర్వహించిన మాదిగల సభలో అంబేడ్కర్ బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి హక్కులు కల్పించలేదని కేవలం బాబూ జగజ్జీవన్ రామ్ వల్లే ఇవన్నీ వచ్చేయని మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. అంబేడ్కర్ ప్రసాదించిన రిజర్వేషన్ల ద్వారా వైద్య విద్యను చదువుకుని ఇప్పుడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాప్రతినిధిగా స్థిరపడిన శ్రీదేవి అంబేడ్కర్ ను చులకన చేస్తూ మాట్లాడడం అత్యంత దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీదేవిపై కఠిన చర్యలు తీసుకోవాలని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: గుంటూరులో టవర్ కు జిన్నా పేరు తొలగించాలి... బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి