Somu Veerraju: గుంటూరులో టవర్ కు జిన్నా పేరు తొలగించాలి... బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్
గుంటూరులోని ఓ టవర్ కు జిన్నా పేరు ఉండడంపై సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పేరు తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశం ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇలాంటి సమయంలో గుంటూరులోని ఓ టవర్ కు జిన్నా పేరు ఉండడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతం వ్యక్తం చేశారు. వెంటనే జిన్నా పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.
జిన్నా దేశ ద్రోహి ఇటువంటి ద్రోహుల పేర్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆజాదీకా అమృత మహోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో దేశ ద్రోహుల పేర్లు ఏప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర్య స్పూర్తి పొందాలంటే సెంటర్ లకు, టవర్ లకు దేశద్రోహుల పేర్లు ఉంటే భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారు. అబ్దుల్ కలాం లేదా జిల్లాలోని ప్రముఖుల పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: ప్రేమ కథా చిత్రమ్... మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఆంధ్ర అబ్బాయి, టర్కీ అమ్మాయి
జాషువా పేరు పెట్టాలని డిమాండ్
గుంటూరులోని జిన్నాటవర్‌ను కూల్చేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ జాతి పిత అయిన మహమ్మద్ అలీ జిన్నా పేరు మీద గుంటూరులో ఎలా స్థూపం ఉందని రాజా సింగ్ ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. జిన్నా టవర్‌కు తక్షణం కలాం పేరు లేదా గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు టవర్‌ను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో జిన్నాటవర్ సెంటర్‌కు ప్రత్యేకత ఉంది. నగరం నడిబొడ్డున ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలకు ప్రధాన కూడలి ఆ ప్రాంతం. జిన్నా టవర్ సెంటర్ అని ప్రజలు అనుకుంటారు కానీ.. ఆ జిన్నా ఎవరూ అని ఆలోచించేవారు 90శాతం మంది ఉండరు. అయితే ప్రాంతాల పేర్లతో రాజకీయం ప్రారంభమైన తర్వాత జిన్నా టవర్ సెంటర్ కూడా వివాదాస్పదం అవుతోంది. గతంలోనూ కొన్ని సార్లు ఆ టవర్ పేరు మార్చాలని డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత సద్దుమణిగాయి.
Also Read: అశోక్‌గజపతిరాజుపై ఉన్న కేసుల్లో తదుపరి చర్యలొద్దు.. పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం !
మహమ్మద్ అలీ జిన్నా గౌరవార్థమే
నిజంగానే జిన్నాటవర్ కు ఉన్న పేరు.. పాకిస్తాన్ జాతిపిత అయిన మహమ్మద్ అలీ జిన్నా గౌరవార్థమే ఏర్పాటు చేశారు. దేశ విభజనకు ముందే ఈ టవర్‌ను నిర్మించారు. అంటే పాకస్థాన్ ఏర్పాటు కాక ముందే గుంటూరులో జిన్నాటవర్ నిర్మాణం జరిగిందన్నమాట. క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మొహమ్మద్ ఆలీ జిన్నాతో సభ నిర్వహించాలని కొంత మంది ఏర్పాట్లు చేశారు. అయితే మొదట వస్తానని చెప్పిన జిన్నా చివరి క్షణంలో పర్యటన రద్దు చేసుకున్నారు. పలువురు స్వాతంత్ర్య సమరయోధులు ఆ సభలో పాల్గొన్నారు. అయితే జిన్నా రాకపోయినప్పటికీ ఆయన గౌరవార్థం ఈ టవర్ నిర్మించారని.. 1945 నుంచి ఈ టవర్ ను జిన్నా టవర్‌గా పిలవడం ప్రారంభించారని చెబుతారు.
Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి