By: ABP Desam | Updated at : 19 Nov 2021 07:03 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్(ఫైల్ ఫొటో)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించడంతో శాసనసభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై మంత్రి వర్గం భేటీలో చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కొత్త పరిశ్రమలకు కేబినేట గ్రీన్ సిగ్నల్
ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాలను కల్పించడం కోసం టీటీడీకి అప్పగించేందుకు చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్‌పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన కొత్త పరిశ్రమలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు 4 షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదించింది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
Also Read: అసెంబ్లీలో అనుమానాస్పదంగా మార్షల్ తీరు.. అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతా సిబ్బంది !
మరిన్ని బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్-1955 చట్టంలో సవరణలు, ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు, ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు రాష్ట్ర మంత్రి వర్గ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్-1994లో సవరణలు, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలు, ఏపీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్-2021 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read: జయలలిత , ఎన్టీఆర్, జగన్.. ఇప్పుడు చంద్రబాబు ! అసెంబ్లీ బాయ్‌కాట్ సవాల్‌కు ఓ చరిత్ర..!
Also Read: తీరం దాటనున్న వాయుగుండం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక!
Also Read: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం.. 5లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
Also Read: తీరం దాటిన వాయుగుండం.. అయినా అప్రమత్తత అవసరం..
Chandra Babu Visits Tirumala: ఏడు కొండల వేంకంటేశ్వరుడిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి
Petrol-Diesel Price 01 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Prices Today 01 December 2023: గోల్డ్ కొనేవారికి గుడ్‌న్యూస్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు
/body>