Ysrcp: చంద్రబాబు కుంటుంబంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు... కుప్పం ఓటమి జీర్ణించుకోలేకే ఆరోపణలు... అంబటి రాంబాబు కామెంట్స్
చంద్రబాబు సతీమణిపై శాసనసభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. కుప్పంలో ఓటమి తట్టుకోలేకే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కుప్పంలో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాలు ఒక్క రోజే నిర్వహించాలని అనుకున్నా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థన మేరకు ఈ నెల 26 వరకు పొడిగించామని తెలిపారు. మళ్లీ సీఎంగానే శాసనసభకు వస్తానని చంద్రబాబు శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారని, సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏవేవో మాట్లాడారన్నారు. సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో తిట్టించినప్పుడు ఆయన ప్రజలకు చెప్పుకున్నారని, కానీ ఇలాంటివి చేయలేదన్నారు. టీడీపీ పార్టీని చంద్రబాబు విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చారన్నారు. మీడియా సమావేశంలో చంద్రబాబు విలపించటం డ్రామా అని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీపై ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Also Read: బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో వైఎస్సార్‌సీపీ పాగా.. టీడీపీ కోటకు బీటలు!
అసెంబ్లీలో పరిణామాలు
అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టారు. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. అసెంబ్లీలో రెండో రోజు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన సతీమణిపై కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు అదే పనిగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ సభ్యులు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ వారిని వారించలేదు. టీడీపీ సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలని సూచించారు.
Also Read: అసెంబ్లీలో అనుమానాస్పదంగా మార్షల్ తీరు.. అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతా సిబ్బంది !
కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు
చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. అయినా ప్రజా సమస్యల పై చర్చల కోసం భరించానన్నారు. ఈ రోజు తన భార్యను, కుటుంబసభ్యులను కూడా రోడ్డు మీదకు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు మైక్‌ను కట్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు తాను చెప్పాలనుకున్నది చెప్పారు. మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని సవాల‌్ చేసి.. సభ్యులందరికీ నమస్కారం చేసి వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా దూషిస్తూ.. వస్తున్నారని అన్నీ భరిస్తూ వస్తున్నానని ఇప్పుడు తన భార్యను కూడా తీసుకొచ్చి విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత పార్టీ ఆఫీసులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల మాటలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. రెండు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేకపోయారు.
Also Read: మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి