యూజ్డ్ Hyundai Venue కొనాలనుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోకపోతే మీరు మోసపోతారు!
యూజ్డ్ Hyundai Venue కొనుగోలు చేయాలనుకుంటే ఇంజిన్, గేర్‌బాక్స్, ఫీచర్లు, DCT సమస్యలు, మైలేజ్, ధర వంటి కీలక విషయాలు ముందుగా తెలుసుకోండి. తెలుగులో పూర్తి గైడ్.

Used Hyundai Venue Price: భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUVల సెగ్మెంట్ ఎంత పోటీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి విభాగంలోని Hyundai Venue, 2019 నుంచి ఇప్పటివరకు మంచి అమ్మకాలతో తనకంటూ ఓ బలమైన స్థానం సంపాదించింది. స్మూత్ ఇంజిన్‌లు, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన కేబిన్ కారణంగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా Venueకి డిమాండ్ ఎక్కువగా ఉంది.
2022 ఫేస్‌లిఫ్ట్ తర్వాత మార్పులు
2022లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్‌తో Hyundai Venueకి కొత్త లుక్ వచ్చింది. ముందు భాగం మరింత షార్ప్‌గా మారింది. ఇంటీరియర్‌లో కొత్త అప్హోల్స్టరీ, అదనపు ఫీచర్లు వచ్చాయి. ముఖ్యంగా రీక్లైనింగ్ రియర్ సీటు వల్ల వెనుక కూర్చునే వారికి కంఫర్ట్ పెరిగింది. కాంపాక్ట్ సైజ్, లైట్ స్టీరింగ్, ఈజీ క్లచ్ కారణంగా నగరాల్లో డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటుంది.
ఇంజిన్, గేర్‌బాక్స్ ఎంపికలు
Hyundai Venue మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది, అవి:
- 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ - 83hp, 5 స్పీడ్ మాన్యువల్
- 1.0 లీటర్ టర్బో పెట్రోల్ - 120hp, iMT లేదా 7 స్పీడ్ DCT
- 1.5 లీటర్ డీజిల్ - 100hp, 6 స్పీడ్ మాన్యువల్
మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్‌కు సుమారు 17.5kmpl, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్‌కు 18kmpl వరకు, డీజిల్ మాన్యువల్‌కు 24.2kmpl వరకు వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. వాస్తవ పరిస్థితుల్లో ఇంత మైలేజ్ రాదు.
మీ డ్రైవింగ్ ఎక్కువగా హైవేల్లో ఉంటే డీజిల్ వేరియంట్ మంచి ఎంపిక. సిటీ వినియోగానికి పెట్రోల్ సరిపోతుంది. ట్రాఫిక్‌లో డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్ వెర్షన్ కావాలంటే, టర్బో పెట్రోల్ DCT ఒక్కటే ఆప్షన్.
వేరియంట్లు, ఫీచర్లు
Venue ఫేస్‌లిఫ్ట్ E, S, S+, S(O), SX, SX(O) వేరియంట్లలో వచ్చింది. టాప్ వేరియంట్‌లో...
- 8 అంగుళాల టచ్‌స్క్రీన్
- సన్‌రూఫ్
- ఆటో క్లైమేట్ కంట్రోల్
- ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు
- వైర్‌లెస్ ఛార్జర్
- ఎయిర్ ప్యూరిఫైయర్
- 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్
వంటి ఫీచర్లు లభిస్తాయి. యూజ్డ్ మార్కెట్‌లో SX లేదా SX(O) వేరియంట్ తీసుకుంటే ఎక్కువ విలువ దక్కుతుంది.
సెకండ్ హ్యాండ్ Venue కొనేటప్పుడు, ముందే చూసుకోవాల్సిన సమస్యలు
DCT ఓవర్‌హీటింగ్: టర్బో పెట్రోల్ DCT వేరియంట్‌లో, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఓవర్‌హీటింగ్ అలెర్ట్ రావడం కొంతమందికి ఎదురైంది. టెస్ట్ డ్రైవ్‌లో గేర్ షిఫ్టింగ్ స్మూత్‌గా ఉందో లేదో చూసుకోవాలి.
ఇన్ఫోటైన్‌మెంట్ సమస్యలు: టచ్‌స్క్రీన్ హ్యాంగ్ అవ్వడం, ఫోన్ డిస్‌కనెక్ట్ అవ్వడం వంటి సమస్యలు కొందరు ఎదుర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ అప్ ట డేట్‌గా ఉందో, లేదో చెక్ చేయాలి.
ఫ్యూయల్ పంప్ ఇష్యూ: టర్బో పెట్రోల్‌లో కొద్దిమందికి ఫ్యూయల్ పంప్ సమస్య వచ్చింది. కారు స్టార్ట్ ఆలస్యం అవుతోందా అన్నది గమనించాలి.
బాడీవర్క్, కన్స్యూమబుల్స్: టైర్లు, బ్రేక్ ప్యాడ్స్, క్లచ్ పరిస్థితి చెక్ చేయాలి. అండర్‌బాడీ, ప్యానెల్స్‌లో తుప్పు లేదా డ్యామేజ్ ఉందేమో పరిశీలించాలి.
యూజ్డ్ Hyundai Venue ధర
ప్రస్తుత మార్కెట్‌లో ఇంజిన్, వేరియంట్, కండిషన్ ఆధారంగా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. హ్యుందాయ్ బ్రాండ్ కావడంతో రీసేల్ విలువ కూడా బాగానే ఉంటుంది. కొత్త కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.53 లక్షల నుంచి రూ.12.57 లక్షల వరకు ఉంది.
మొత్తానికి, సిటీలో ఈజీ డ్రైవింగ్, మంచి ఫీచర్లు, నమ్మకమైన ఇంజిన్ కావాలంటే యూజ్డ్ Hyundai Venue ఒక సేఫ్ ఆప్షన్. కానీ కొనుగోలు ముందు పూర్తి చెక్ చేయడం మాత్రం తప్పనిసరి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















