By: ABP Desam | Updated at : 28 Feb 2022 07:11 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
Corona Updates: ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 7,969 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 71 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,727కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 595 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,300,760 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 2325 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,812కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,31,05,610 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 28/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 28, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,17,812 పాజిటివ్ కేసు లకు గాను
*23,00,760 మంది డిశ్చార్జ్ కాగా
*14,727 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,325#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ATsl5IKtEC
#COVIDUpdates: As on 28th February, 2022 10:00AM
COVID Positives: 23,17,812
Discharged: 23,00,760
Deceased: 14,727
Active Cases: 2,325#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/C1IA1EFUaI— ArogyaAndhra (@ArogyaAndhra) February 28, 2022
Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా పది వేల లోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారత్‌లో 8,013 (8 వేల 13) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డైలీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి దిగొచ్చింది. కొవిడ్ 19 రికవరీ రేటు ఏకంగా 98 కంటే ఎక్కువ అయింది. దేశంలో ప్రస్తుతం 1,02,601 (1 లక్షా 2 వేల 6 వందల 1) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు.
తాజాగా 119 మంది మృతి
ఆదివారం ఒక్కరోజులో 16,765 (16 వేల 765) మంది కరోనా మహమ్మారిని జయించారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,07,686 (4 కోట్ల 23 లక్షల 7 వేల 686)కు చేరింది. కొవిడ్ తో పోరాడుతూ తాజాగా 119 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కిందటి రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా తగ్గాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,13,843 (5 లక్షల 13 వేల 843)కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో 782 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించగా.. మొత్తం కేసుల సంఖ్య 78,65,298కి చేరుకున్నాయి. ఇదే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,629కు చేరగా దాపు 90 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో 2,524 కేసులు నమోదయ్యాయి, దీంతో కేరళలో మొత్తం కేసుల సంఖ్య 64,97,204కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 65,223కు పెరిగింది.
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం