Janasena : నాడు సందుల్లో తిరిగి ముద్దులు పెట్టారు..నేడు కంటికి కనిపించడం లేదు .. జగన్‌పై జనసేన సెటైర్లు !
వరద ముంపునకు కారణం ఇసుక, గ్రావెల్ మాఫియాలేనని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వర్క్ ఫ్రం హోమ్‌కు అలవాటు పడిన జగన్ ఇల్లు కదలడం లేదని విమర్శించారు.
నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పరామర్శకోసం వచ్చిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. సందు సందులో తిరిగి జనాలకు ముద్దులు పెట్టిన జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అడిగి సీఎం అయ్యారని, ఇప్పుడు ఆయన కనపడ్డం లేదని మండిపడ్డారు. వరదలతో కడప జిల్లా అతలాకుతలం అయితే.. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో కూడా పర్యటించలేదని అన్నారు. కేవలం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారని సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కి అలవాటు పడ్డారని విమర్శించారు.
Also Read : అమరావతి మహిళా రైతులకు చీర, సారె.. కోవూరు ప్రజల ఆత్మీయత !
కడప జిల్లాలో వచ్చిన వరదలకు ప్రకృతి విపత్తు కారణం కాదని, ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలేనని చెప్పారు. నెల్లూరు నగరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన నాదెండ్ల మనోహర్.. వరద సహాయ చర్యల్లో జనసైనికుల చొరవను ప్రశంసించారు. అయితే నేతలు, అధికారులు ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తడంలో ఆలస్యం చేయడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో కూడా సమయం వృథా చేశారని, అర్థవంతమైన చర్చలు జరగలేదని అన్నారు నాదెండ్ల మనోహర్. గేట్లు ఎత్తడం ఒక్కరోజు ఆలస్యం చేయడం వల్లే గ్రామాలు కొట్టుకుపోయాయని అన్నారు.
Also Read : మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకున్నాం... హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
చిన్న వయసులో ఉన్న ముఖ్యమంత్రి చాలా హుషారుగా పనిచేయాలని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కి అలవాటు పడ్డారని విమర్శించారు. వరదల సమయంలో ప్రభుత్వం కంటే సామాన్య ప్రజలే ఎక్కువగా ఇతరులను ఆదుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నాదెండ్ల మనోహర్. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టండని హితవు పలికారు. అందరు నాయకులు ఒకేమాటపై నిలబడాలని, పదవులతోపాటు పార్టీకోసం పనిచేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నాదెండ్ల మనోహర్, బాధితులకు ధైర్యం చెప్పారు.
Also Read : జగన్‌పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?
మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రలో కూడా జనసైనికులు కలసి నడిచారు. నెల్లూరులో రైతులతో కలసి యాత్రగా ముందుకు సాగారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమని.. మొదటి నుంచి తమది అదే ఆలోచన అన్నారు. రైతులకు జనసేన పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి