Amaravati Farmars : అమరావతి మహిళా రైతులకు చీర, సారె.. కోవూరు ప్రజల ఆత్మీయత !
నెల్లూరు జిల్లా కోవూరులో పాదయాత్రలో మహిళా రైతులకు అక్కడి ప్రజలు చీర, సారె పెట్టి గౌరవించారు. మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహిళా రైతులకు స్థానికులు చీర, పసుపు, కుంకుమలు అందించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. అక్కడి ప్రజలు రైతులకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. కోవూరుకు పాదయాత్ర చేరుకున్న సమయంలో అక్కడి ప్రజలు మహిళా రైతులకు చీర, సారె పెట్టి ఆత్మీయత చూపారు. కోవూరులోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహిళా రైతులకు స్థానికులు చీర, పసుపు, కుంకుమలు అందించారు. ఆలయంలో కోటి దీపోత్సవం సందర్భంగా మహిళా రైతులంతా దీపారాధనలు వెలిగించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అక్కడ మొక్కుకున్నారు.
Also Read : మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకున్నాం... హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర వానలకు వెరవక ముందుకు సాగుోతంది. నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అమరావతి రైతులకు ఘన స్వాగతం పలుకుతున్నారు స్థానికులు. ఈ యాత్రలో మొదటినుంచీ టీడీపీ నేతలు పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. అయితే యాత్రకు ప్రజాస్పందన ఎక్కువగా వస్తూండటంతో ఇతర పార్టీల నేతలు కూడా వచ్చి సంఘిభావం తెలియచేస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘిభావం తెలిపారు.
Also Read : జగన్‌పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?
అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన తర్వాత బీజేపీ, జనసేన నేతలు కూడా మద్దతుగా తరలి వచ్చారు. దీంతో రైతుల పాదయాత్ర సందడిగా సాగుతోంది. మల్లికార్జున స్వామి ఆలయంలో పూజల అనంతరం మహిళా రైతులు సారె తీసుకుని యాత్రలో పాల్గొన్నారు. రైతుల పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించిన తర్వాతే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అయితే రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని నమ్మలేదు. తమ పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు.
Also Read : సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
తిరుపతి వరకూ పాదయాత్ర చేసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే తిరుగుపయనమవుతామని రైతులు చెబుతున్నారు. పాదయాత్రను..అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడపుతున్నారు. పెద్ద వయసు రైతులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. అమరావతి రైతులపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా వారు ాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !