Top Headlines: ఏపీలోని ఈ జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్ - కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వణికిస్తోన్న పెద్దపులి, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. ఏపీలోని ఈ జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, ట్రింకోమలీ(శ్రీ లంక)కి ఉత్తర ఈశాన్యముగా 130 కిలోమీటర్లు నాగపట్టణానికి తూర్పుగా 150 కి.మీ. . దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర కారైకాల్ మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇంకా చదవండి.
2. హెయిర్ కటింగ్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంకిరెడ్డిపల్లెకు చెందిన 7వతరగతి విద్యార్థి సిద్ధిక్ బాషా(13) కు హెయిర్ కటింగ్ నచ్చలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. జుత్తు ఎక్కువైందని క్షవరం చేయించుకోమని ఇంట్లోని పెద్దమ్మ, పెదనాన్న చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా..కాస్త స్టైల్గానే కటింగ్ చేసుకున్నానని భావించి ఆ కుర్రాడు ఇంటికి వెళ్లాడు. అది నచ్చని పెదనాన్న, పెద్దమ్మ సగం జుత్తు కత్తిరించుకుని వచ్చావేంటని ప్రశ్నించారు. ఇంకా చదవండి.
3. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వణికిస్తోన్న పులి
పత్తి ఏరుతుండగా యువతి పులి దాడి చేసి చంపేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన ఈ దారుణం జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఎటు నుంచి క్రూరమృగం దాడి చేస్తుందో అని మండల ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. యువతి మోర్లె లక్ష్మీ మృతితో అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మండలం మొత్తం 144 సెక్షన్ విధించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఉమ్మది ఆదిలాబాద్ జిల్లాలో పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువుల మందలపై దాడులు చేస్తూ వచ్చాయి. ఇంకా చదవండి.
4. కేటీఆర్ సంచలన ట్వీట్
రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్నిరోజుల పాటు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని.. దీని కారణంగా ప్రత్యర్థులు మిస్ అవ్వరు కదా అంటూ పోస్టు చేశారు. ఇంకా చదవండి.
5. చికాగో కాల్పుల్లో ఖమ్మం యువకుడు మృతి
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుర్రాడు యూఎస్ వెళ్లి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది. ఇంతలో పెను విషాదం చోటు చేసుకుంది. చికాగోలో జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకున్న పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లా రామన్న పేట్‌కు చెందిన 26 ఏళ్ల సాయితేజ్ నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. చికాగోలోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్సీ చదువుతున్నాడు. ఇంకా చదవండి.