KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్
Telangana News: రాజకీయాలకు కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

KTR Small Give A Small Break: రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్నిరోజుల పాటు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని.. దీని కారణంగా ప్రత్యర్థులు మిస్ అవ్వరు కదా అంటూ పోస్టు చేశారు.
Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁
— KTR (@KTRBRS) November 30, 2024
గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు కొద్ది రోజులు మినహా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉన్నారు కేసీఆర్. అందుకే కొన్ని రోజుల పాటు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షా దివస్ విజయవంతం కావడంతో శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ శ్రేణులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంచేశాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇకపై రెగ్యులర్‌గా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాల కారణంగా బీఆర్ఎస్ కేడర్ చాలా వరకు డీలా పడింది. అందుకే పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా మెయిన్ స్ట్రీమ్ లీడర్లు తప్ప గ్రామస్థాయి కేడర్ కదలింది లేదు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను పెట్టి ప్రతి గ్రామ కార్యకర్త పాల్గొనేలా ప్లాన్ చేశారు.
ఇదే ఊపు త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో చూపించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అప్పటి వరకు కేడర్‌లో మరింత జోష్ నింపేందుకు మరిన్ని కార్యక్రమాలకు పిలుపునివ్వబోతున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే గ్యాప్‌లోనే విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ భావించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కవిత కూడా యాక్టివ్ అయ్యారు. ఓవైపు హరీష్‌రావు ప్రజల్లోనే ఉంటున్నారు. కొన్ని రోజులు ఇద్దరూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని భావిస్తున్నారు.
విశ్రాంతి తీసుకొని మరింత ఉత్సాహంగా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు రావాలని భావిస్తున్నారు కేటీఆర్. శ్రేణులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. విశ్రాంతి సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు తాము సమాధానం ఇస్తామంటూ ట్విట్టర్‌లో ఆయన పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.
శుక్రవారం జరిగిన దీక్షా దివస్‌లో మాట్లాడిన కేటీఆర్... కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణలో పూడ్చలేని నష్టం వాటిల్లిందన్నారు. గుజరాత్ గులాములు, ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అవసరమైతే ప్రజల కోసం మరోసారి దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవతం చేసిన వారందరికీ ఆయన అభినందలు తెలియజేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

