అన్వేషించండి

Top Headlines: ఏపీలో నిరుద్యోగులకు బిగ్ షాక్ - తెలంగాణలో ఇంటింటి సమగ్ర సర్వే, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In Ap And Telangana:

1. ఏపీలో నిరుద్యోగులకు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు విద్యాశాఖ షాకిచ్చింది. టెట్ ఫలితాలు వెలువడగానే మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. ఏపీలో నవంబరు 4న టెట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేస్తారని అభ్యర్థులు ఆశించారు. కానీ తాజాగా మెగా డీఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి విద్యాశాఖ ఉసూరుమనిపించింది. ఇంకా చదవండి.

2. అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సినీ నటుడు అల్లు అర్జున్‌పై నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు. ఆ టైంలో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో గత నెలలో పిటిషన్ వేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని స్నేహితుణ్ని కలవడానికి మాత్రమే వెళ్లానంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఇంకా చదవండి.

3. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్

"వన్‌ స్టేట్‌-వన్‌ ఆర్‌ఆర్‌బీ" కార్యక్రమంలో భాగంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (Regional Rural Banks/ RRBs) ఏకీకరణలో 4వ దశను ప్రారంభించింది. RRBల పనితీరును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం ఈ విలీన ప్రక్రియ లక్ష్యం. ఫలితంగా, దేశంలో ప్రస్తుతమున్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గుతుంది. నాబార్డ్‌ (NABARD)తో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదింపుల తర్వాత, కేంద్ర ప్రభుత్వం RRBల విలీన నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి.

4. తెలంగాణలో ఇంటింటి సమగ్ర సర్వే

తెలంగాణలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సర్వేను ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో ఉన్న సభ్యుల వివరాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ఉద్యోగ, రాజకీయ నేపథ్యంపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల వివరాలు తెలుసుకునేలా ఈ సర్వే ప్రశ్నావళిని రూపొందించారు. ఇంకా చదవండి.

5. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌ భారీ విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటికే ఆయన 300కుపైగా ఎలక్టోర్స్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఫైనల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఆధిక్యం చూస్తే ట్రంప్‌ గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి 277 ఎలక్టోర్స్‌లో విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారు అనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి  కమలా హారిస్ కేవలం 226 ఎలక్టోర్స్ వద్ద ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా చదవండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
Viral Video: బాలయ్య డ్యాన్స్‌తో ఫిజిక్స్ పాఠాలు- వైరల్ అవుతున్న వీడియో క్లాస్‌
బాలయ్య డ్యాన్స్‌తో ఫిజిక్స్ పాఠాలు- వైరల్ అవుతున్న వీడియో క్లాస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
Viral Video: బాలయ్య డ్యాన్స్‌తో ఫిజిక్స్ పాఠాలు- వైరల్ అవుతున్న వీడియో క్లాస్‌
బాలయ్య డ్యాన్స్‌తో ఫిజిక్స్ పాఠాలు- వైరల్ అవుతున్న వీడియో క్లాస్‌
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Embed widget