Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు
Ap High Court: స్నేహితుడి కోసం నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఇబ్బంది పడ్డ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఆయనపై రిజిస్టర్ అయిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది.
Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సినీ నటుడు అల్లు అర్జున్‌పై నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు. ఆ టైంలో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో గత నెలలో పిటిషన్ వేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని స్నేహితుణ్ని కలవడానికి మాత్రమే వెళ్లానంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
ఏంటీ నంద్యాల కేసు
ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్న టైంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన అప్పటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదు కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని.. ఆయనకు మద్దతుగానే వచ్చానని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారీగా జనం రావడంపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆయన మీడియాతో మాట్లాడటాన్ని కూడా పరిశీలించింది. మొత్తం వ్యవహారం కూడా ఎన్నికల ప్రచారంగానే భావించింది. అందుకే ఆయనపై కేసు నమోదు చేయాలని నంద్యాల అధికారులను ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో స్థానిక ఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ జరిపారని అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి, అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు.
దీనిపై హైకోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్ కేసును క్వాష్ చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు కేను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అల్లు అర్జున్‌కు భారీ ఊరటగానే చెప్పవచ్చు. ఒక వేళ కోర్టు విచారణకు ఓకే చెప్పి ఉంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి.
మెగా అభిమానులు వర్సెస్ అల్లు అర్జున్
ఇది పొలికిటల్‌గానే కాకుండా మెగా అభిమానుల మధ్య కూడా చిచ్చు రేపింది. ఓవైపు పిఠాపురంలో పోటీ చేస్తూ కూటమి విజయం కోసం జనసేన అధినేత పవన్ కల్యాన్ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ, అభిమానులు ఎవరి ప్రాంతాల్లో వారు ప్రచారం చేశారు. కానీ ఇంతలో అల్లు అర్జున్ వారికి వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తానని చెప్పడం కూడా మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్‌తో మెగా అభిమానులకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది.
Also Read: "పుష్ప 2" ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ - ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన "పుష్ప"!