అన్వేషించండి

Pushpa 2: "పుష్ప 2" ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ - ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన "పుష్ప"!

Pushpa 2 Trailer: "పుష్ప 2" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతున్నట్టు సమాచారం. మరి ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్ ను ఎప్పుడు, ఎక్కడ లాంచ్ చేయబోతున్నారో తెలుసుకుందాం పదండి.

Pushpa 2 Trailer Launch: మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2'కు ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఇదివరకు కనీవినీ ఎరగని ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారనే సమాచారం తాజాగా బయటకు వచ్చింది. 

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ గా, ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2 : ది రూల్'. ఈ సీక్వెల్ కోసం చాలా కాలం నుంచి మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా మేకర్స్ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్లను డిసెంబర్ 4 నుంచి బిగ్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారు. కాగా "పుష్ప 2" టీం ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ కోసం భారీ మార్కెటింగ్ ప్లాన్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. నవంబర్ మిడిల్ నుండి "పుష్ప 2" మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని సమాచారం. 

Read Also: Appudo Ippudo Eppudo Trailer: ‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?

ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం "పుష్ప 2" ప్రమోషన్స్ నవంబర్ 15 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఆ తర్వాత 15 రోజుల వ్యవధిలోనే అల్లు అర్జున్ పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లను సందర్శించబోతున్నారు. "పుష్ప 2" టీం ప్రమోషన్ల కోసం భారతదేశంలోని ముఖ్యమైన సిటీలన్నింటిని కవర్ చేయబోతోంది. ఇక నవంబర్ 15న ఈ మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ఈ ప్రమోషనల్ ఈవెంట్లు స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అంతా అనుకున్నట్టుగా జరిగితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత స్పెషల్ ఈవెంట్స్ పేరుతో చిత్ర బృందం దేశం మొత్తం పర్యటించబోతున్నారు. 

నిజానికి 'బాహుబలి 2' తర్వాత అదే రేంజ్ హైప్ ఉన్న సినిమా 'పుష్ప 2'. కాబట్టి ఈ సినిమాకు అదే రేంజ్ లో ప్రమోషన్స్ చేయడం కూడా ముఖ్యమే. అయితే రానున్న 30 రోజుల్లో అంతా ప్లాన్ ప్రకారం జరిగితే 'పుష్ప 2' మూవీ ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ గా అవతరించడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రత్యేకంగా హిందీ బెల్ట్ లలో ఈ మూవీ సరికొత్త రికార్డులను సెట్ చేస్తుందని నమ్ముతున్నారు. అలాగే భారతీయ సినిమా చరిత్రలో భారీ వసూల్లు రాబట్టిన సినిమాగా ఈ మూవీ నిలుస్తుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికైతే నవంబర్ 15న జరగబోయే 'పుష్ప 2' థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పైనే అందరి దృష్టి ఉంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. నిర్మాతలు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నామని రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రోజే క్లారిటీ ఇచ్చారు. కానీ ట్రైలర్ లాంచ్ ఎప్పుడు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. 

Read Also : Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget