Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Actress Kasturi announces to enter Telugu politics | తెలుగు ప్రజలకు తాను రుణపడి ఉన్నానని, వారి కోసం ఇక్కడి రాజకీయాల్లోకి వస్తున్నానని చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ నటి కస్తూరి కీలక ప్రకటన చేశారు.
Actress Kasturi sensational comments on DMK leaders | చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే నేతల టార్చర్ భరించలేకపోతున్నానని, తనకు హైదరాబాద్ అభయం ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ తమిళ రాజకీయాలపై మాట్లాడాను, కానీ ఇప్పుడు చెబుతున్నా.. తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. తనను ఎంతగానో ఆదరించిన తెలుగు వారికి తనను దూరం చేయాలన్న ప్రయత్నం జరుగుతుందన్నారు. తెలుగు ప్రజలకు తాను రుణపడి ఉంటున్నానని, ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చి వారి కోసం పాటుపడతా అన్నారు. తమిళంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ అడగకుండా తిట్టారని, తెలుగు ప్రజలు మాత్రం మీరు ఇలా అన్నారా, కామెంట్లు చేశారా వివరణ కోరారని.. దటీజ్ తెలుగు ప్రజలు అన్నారు.
పవన్ కళ్యాణ్ దారిలో నడిచేందుకు రెడీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాను అభిమానినని, ఆయన దారిలో నడుస్తానని నటి కస్తూర్తి సంచలన ప్రకటన చేశారు. నేను ఈరోజు ట్రెండింగ్ లో ఉన్నాను, కానీ మంచి విషయంలో కాదంటూ నటి కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళంలో తాను చేసిన వ్యాఖ్యల్ని తెలుగులో తప్పుగా అనువాదం చేశారని తన ఇంటివద్ద తెలుగు మీడియాతో అన్నారు. సర్వ సామాజిక సమావేశంలో డీఎంకే (DMK) చేసే అన్యాయాలు, నేరాలను విమర్శించడం, ఎత్తి చూపడంతో వారు తనపై దుష్ప్రచారం చేశారని కస్తూరి పేర్కొన్నారు.
డీఎంకే సిద్ధాంతాలు తెలుసుకోండి: కస్తూరి
డీఎంకే సిద్ధాంతం తెలుగువాళ్లు తెలుసుకోవాలి. దేవుడు లేడని డీఎంకే నేతలు అంటారు. ముఖ్యంగా హిందూ దేవతలు, దేవుళ్ల లేరు. సనాతన ధర్మాన్ని విశ్వసించేవాళ్ల తెలివి తక్కువ వాళ్లు అని డీఎంకే వాళ్లు భావిస్తారు. బ్రాహ్మణులు అనేవారు స్థానికులు కాదు, పరదేశీయులు అని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనేది కూడా డీఎంకే సిద్ధాంతం. ఈ విషయాలను ఎత్తిచూపానన్న కారణంగా నాపై ఎన్నో వదంతులు ప్రచారం చేశారు. తాగుబోతు అన్నారు. ఎవరెవరితోనే అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసినా వాటిని అంతగా పట్టించుకోలేదు.
తెలుగు ప్రజలను కస్తూరి కించపరిచిందంటూ తనపై డీఎంకే నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాట్లాడిన ఆ వేదిక మీద తెలుగువాళ్లు కూడా ఉన్నారు. నా మెట్టినిల్లు తెలుగు ప్రాంతం. నా పిల్లల రక్తంలో తెలుగుదనం ఉంది. ఎవరు వచ్చినా తెలుగువాళ్లు ప్రేమ చూపిస్తారు. వేరే వాళ్లను అయినా ప్రోత్సహించేతత్వం వారిది. ఒక నేత ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడా. ఓపెన్ గా దీని గురించి నిజాలు చెప్పినా ఇది మరో రగడ, కేసు అవుతుంది. రాజకీయాల్లో నేను లేకుండా చేయాలన్నది డీఎంకే నేతల ఉద్దేశం. అందుకు నన్ను టార్గెట్ చేసుకుని, నా వ్యాఖ్యల్ని దుష్ప్రచారం చేస్తున్నారు.
భక్తులకు బాధ కలిగింది..
తిరుమల లడ్డూ కల్తీ వివాదం సమయంలో తెలుగు వారు ఎంతో బాధపడ్డారు. ఈ విషయంపై డీఎంకే వాళ్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు రోజూ బీఫ్ కొవ్వు తిన్నారు కదా, బాగుందా, రోజూ అలాగే తినండంటూ డీఎంకే నేతలు తెలుగు వారిని అపహాస్యం చేశారు. కేవలం తెలుగు ప్రాంతం నుంచి తమిళనాడుకు వలస వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడా. ఎక్కడినుంచి వచ్చినా వారి సొంతమని చెప్పలేకపోతున్నారు. తమిళనాడులో 5 మంది తమిళ మంత్రులు ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలిసి సమస్య అవుతుందని, డీఎంకే నేతలు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తెలుగు వారిపై దుష్ప్రచారం చేసిన బాధ పెట్టిన డీఎంకే నేతలు క్షమాపణ చెప్పాలి. తెలుగు వారి మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు సారీ చెప్పకపోతే వారి తరఫున నేను క్షమాపణ చెబుతాను’ అన్నారు.
Also Read: Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తాను తమిళంలో చేసిన కామెంట్లను డీఎంకే నేతలు తెలుగు, ఇంగ్లీష్ లో తప్పుగా అనువాదం చేసి ఏపీ, తెలంగాణలోని తెలుగు వారికి వీడియోలు షేర్ చేస్తున్నారని నటి కస్తూరి తెలిపారు. మొన్నటివరకూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన డీఎంకే నేతలు, నేడు ప్రేమ కురిపిస్తూ ఆయనకు ఎందుకు ట్యాగ్ చేస్తున్నారని ఆలోచించాలన్నారు. డీఎంకే నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మకుండా తెలుగు ప్రజలు తిప్పికొట్టాలని, మీ అమ్మాయిని నమ్మాలన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే నేతలు నుంచి తాను నటిగా, మహిళగా, నాయకురాలిగా ప్రతిరోజూ వేధింపులు ఎదుర్కొంటున్నానని సంచలన విషయాలు తెలిపారు.