అన్వేషించండి

Tirumala News:తిరుమలలో పెరుగుతున్న రద్దీ- అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం! ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం

Tirumala News:తిరుమలలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల కోసం భక్తులు ఎగబడటంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Tirumala News: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవులు కారణంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఏడు కొండులు జనసంద్రంతో నిండిపోయాయి. ఈ క్రమంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ గందరగోళం ఏర్పడింది. అలిపిరి భూదేవీ కాంప్లెక్స్‌లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దర్శన టికెట్లు తీసుకునే టైంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు ఆరోపించారు. టికెట్ కౌంటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న టీటీడీ సిపడా కౌంటర్‌లు కూడా ఏర్పాటు చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

దీనిపై అధికారులు స్పందించారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ... సెలవుల కారణంగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగిందన్నారు. SSD టోకెన్లు పూర్తికావడంతో దివ్యదర్శనం టోకెన్ల కోసం భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారని తెలిపారు. పరిస్థితిని వెంటనే గమనించిన విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది భక్తులను క్రమబద్ధీకరించారని వివరించారు. " దర్శన టోకెన్లు పూర్తయ్యాయని భక్తులకు స్పష్టంగా తెలియజేశాం. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ, తొక్కిసలాట గానీ జరగలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. భక్తులు సిబ్బంది సూచనలు పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని కోరుతున్నాం. వదంతులు వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. 

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కూడా పలు సూచినలు చేశారు. "సెలవుల కారణంగా తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగానే కేటాయించిన 15,000 SSD టోకెన్లు పూర్తిగా పంపిణీ చేయడం జరిగింది. కోటా పూర్తి కావడంతో టోకెన్ జారీ చేసే కౌంటర్లను అధికారులు మూసివేశారు. SSD టోకెన్లు అయిపోవడంతో, దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారనే ఆశతో సుమారు 500 నుంచి 600 మంది భక్తులు అక్కడే వేచి ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ, తొక్కిసలాట గానీ జరగలేదు. దీనిపై వస్తున్న తప్పుడు వదంతులను భక్తులు నమ్మవద్దని కోరుతున్నా" అని విజ్ఞప్తి చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Embed widget