Top Headlines: ఏపీలో వాలంటీర్ల కథ ముగిసినట్లేనా? - సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. ఏపీలో వాలంటీర్ల కథ ముగిసినట్లేనా?
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ ఉనికిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అసలు ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. 2023 సెప్టెంబర్‌లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పుకొచ్చారు. శాసన మండలిలో వలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రి విరాంజనేయస్వామి, మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇంకా చదవండి.
2. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ మధ్య ఏర్పాటు చేసిన డ్రోన్ సదస్సులో హామి ఇచ్చినట్టుగా ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన మహిళలను ఇందులో శిక్షణ ఇస్తారు. దీంతో వ్యవసాయ పనుల్లో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, రైతుల డబ్బులు ఆదా చేసేలా యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది. ఈ కాలంలో వ్యవసాయం అంటే చిన్న విషయం కాదు. పంట పండించేందుకు సిద్ధమైనప్పటి నుంచి ఆ పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చు, కూలీల కొరత, గిట్టుబాటు ధర ఈ మూడే నేటి తరం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఇంకా చదవండి.
3. ఆ అనుమతులు ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా.?
ముంతాజ్ హోటల్స్ నిర్మాణంలో ఉంది అని శ్రీవారి భక్తులు తిరుమలపైకి వెళ్లే సమయంలో ఓ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అత్యంత లగ్జరీగా అలిపిరి వద్ద నిర్మిస్తున్న ఈ హోటల్ విషయంలో వేరే అభ్యంతరాలు ఏమీ లేవు కానీ పేరు మాత్రం వేరుగా ఉంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అందుకే కొత్త టీటీడీ బోర్జు శరవేగంగా స్పందించింది. ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని అంతకు ముందు ప్రపోజ్ చేసిన దేవలోకం ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇంకా చదవండి.
4. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలు. అబద్ధాలు, మోసాలు, తప్పుడు ప్రమాణాలతో అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. హనుమకొండలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్ రావుతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం అనే విషయాన్ని మరిచిపోయి రేవంత్ రెడ్డి చిల్లరగా, చీటర్‌గా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఇంకా చదవండి.
5. శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు చోట్ల నుంచి శబరిమలకు మొత్తం 26 అదనపు రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South central Railway) తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంకా చదవండి.