Black Diamond Apple: నల్లగా ఉంటే.. రంగేశారు అనుకుంటివా? ఇది ఓరిజనల్ యాపిల్ పండే.. కలరే కాదు.. ధర చూసినా.. ఓరినీ అనుకోవాల్సిందే
మీరు ఎప్పుడైనా.. బ్లాక్ యాపిల్ చూశారా? కనీసం దాని గురించి విన్నారా? లేదనే సమాధానమే వినిపిస్తుంది. రెడ్, గ్రీన్ యాపిల్సే కాదు.. నలుపు రంగు యాపిల్స్ కూడా ఉన్నాయి.
నల్లగా కనిపించే.. యాపిల్సే బ్లాక్ డైమండ్ యాపిల్. ఇది అరుదుగా కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అసలు ఇలాంటి యాపిల్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. కొంతమంది రైతులు ఈ రకమైన యాపిల్స్ పండించేందుకు ఆసక్తిగా ఉంటారు. దీనికి నిర్దిష్టమైన వాతావరణం మాత్రం అవసరం. ఎక్కడ పడితే అక్కడ పెరగదు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి. ఇది భూటాన్ కొండలపై పెరుగుతుంది. ఈ రకమైన యాపిల్‌ను 'హువా నియు' అని కూడా అంటారు.
చైనీస్ కంపెనీ 'డాన్‌డాంగ్ టియాలువో షెంగ్ నాంగ్ ఇ-కామర్స్ ట్రేడ్' దీనిని 50 హెక్టార్ల భూమిలో బ్లాక్ యాపిల్స్ సాగు చేస్తుంది. అయితే ఇక్కడ యాపిల్స్ కేజీల లెక్కన కొనుగులు చేస్తారు అనుకోకండి. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. ఇక్కడ ఒక్కో యాపిల్ లెక్కన కొనుగోలు చేస్తారు. ఒక్కో బ్లాక్ యాపిల్ ధర ఎంత ఉంటుందో తెలుసా? 50 యువాన్ అంటే 500 రూపాయలు. ఒక్క నలుపు రంగు యాపిల్ ను అంత ధర పెట్టి కొనుక్కోవాలన్నమాట.
ఇదంతా సరే.. అసలు బ్లాక్ యాపిల్ తినొచ్చా? అనే అనుమానం మీకు కలిగే ఉంటుంది. ఆ కలరేంటి అనే ప్రశ్నతో తినాలో.. వద్దో.. అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే ఇది ఎరుపు, ఆకుపచ్చ యాపిల్ లాగా సురక్షితమైనేదేనని చెబుతున్నారు నిపుణులు.
బ్లాక్ డైమండ్ యాపిల్ సాధారణ యాపిల్‌ల మాదిరిగానే ఆరోగ్యకరమైనది. బ్లాక్ యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గింపులో మరియు హృదయ సంబంధ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. నలుపు రంగు యాపిల్స్ లో విటమిన్ 'సి' మరియు 'ఎ', అలాగే పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి.
బయటి నుంచి చూస్తే.. బ్లాక్ యాపిల్ చాలా మృదువైనదిగా.., ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ యాపిల్ విస్తృతంగా అందుబాటులో ఉండదు. దీని ఉత్పత్తి చాలా పరిమితం. ఒక సాధారణ యాపిల్ చెట్టు పరిపక్వం చెందడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అయితే ఒక బ్లాక్ యాపిల్ చెట్టు పరిపక్వం చెందడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 30% మాత్రమే నల్ల ఆపిల్లను ఉత్పత్తి చేస్తాయి.
Also Read: Agri News: మామిడి, దానిమ్మ రైతులకు శుభవార్త చెప్పిన అమెరికా... ఈ నెల నుంచి ఎగుమతులు ప్రారంభం
Also Read: PM Kisan: రైతులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగిచ్చేయండి