Agri News: మామిడి, దానిమ్మ రైతులకు శుభవార్త చెప్పిన అమెరికా... ఈ నెల నుంచి ఎగుమతులు ప్రారంభం
భారత్ మామిడి పండ్లపై అమెరికా రెండేళ్ల క్రితం నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. మామిడి పండ్లతోపాటు దానిమ్మపై కూడా నిషేదాన్ని ఎత్తివేసింది.
భారత్ మామిడి, దానిమ్మ పండ్ల దిగుమతిని పెంచే దిశగా నిబంధనలను సడలించింది అమెరికా. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికన్ చెర్రీస్, పంది మాంసం, అల్ఫాల్ఫా భారత్ మార్కెట్‌లోకి బహిరంగ మార్కెట్‌లో అనుమతి ఇస్తున్నట్టు భారత్ అంగీకరించింది. ఈ కారణంగానే భారత్ మామిడి, దానిమ్మ పండ్ల దిగుమతికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మామిడి, దానిమ్మ దిగుమతి అంశం భారత్, అమెరికా మధ్య కొన్నేళ్లుగా నలుగుతోంది. ఎట్టకేలకు ఇటీవలే అమెరికా ప్రభుత్వ అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా మామిడి పండ్లపై పడిన నిషేధం ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మామిడి పండ్ల దిగుమతికి అంగీకరించింది. అయితే దీన్ని చెర్రీస్, ధానాతో ముడిపెట్టింది.
మొత్తానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్, యూఎస్‌టీఆర్ కథెరిన్ తై భేటీల ఫలితంగా నిషేధాన్ని ఎత్తివేసింది అమెరికా. "2 Vs 2 అగ్రి మార్కెట్ యాక్సెస్ ఇష్యూస్" అమలు చేసేలా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మధ్య ఒప్పందం జరిగింది. జనవరి, ఫిబ్రవరి నుంచి మామిడి, దానిమ్మ ఎగుమతి ప్రారంభం కానుంది. దానిమ్మ గింజల ఎగుమతి ఏప్రిల్‌లో ప్రారంభంకానుంది. పశువుల మేతు ఉపయోగించే అల్ఫాఅల్ఫా గడ్డి, చెర్రీస్ దిగుమతి ఏప్రిల్‌లో స్టార్ట్ కానుంది.
#USA Permits Import Of #Indian Mangoes & Pomegranates As #India Allows Entry Of #Americans Cherries & Pork. However, the shackles on this trade were removed following a meeting between Union Commerce Minister @PiyushGoyal & #UnitedStates #Trades Representative @AmbassadorTai . pic.twitter.com/ZkBzIShCYO
— Vijay kumar🇮🇳 (@vijaykumar1305) January 9, 2022
వీటితోపాటు పంది మాంసం దిగుమతి అంశంపై కూడా అమెరికా, భారత్ మధ్య చర్చలు జరిగాయి. దీనిపై ఒప్పందం కూడా చివరి దశలో ఉంది. అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త బలపడ్డాయి. అప్పటి వరకు ఉన్న కొన్ని ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతానికి మరింతగా ప్రయత్నించాలని ఇరు దేశాలు మాట్లాడుకున్నాయి. ఇప్పటికే ఇలాంటి ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు గతంతో పోలిస్తే యాభై శాతం పెరిగినట్టు తెలిపింది అధికార యంత్రాంగం.
Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
Also Read: Precautionary Covid Vaccine: దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు పంపిణీ.. ఈ విషయాలు తెలుసుకోండి!
Also Read: పిల్లాడిపై ఆ కోతులకు ఎందుకు పగ.. ఇంట్లో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లాయి.. అంతకుముందు ఇలానే..