Precautionary Covid Vaccine: దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు పంపిణీ.. ఈ విషయాలు తెలుసుకోండి!
దేశవ్యాప్తంగా అర్హులైన వారికి కరోనా ప్రికాషన్ డోసు పంపిణీ మొదలైంది. అసలు ఈ ప్రికాషన్ డోసు అంటే ఏంటి? మీరే చూడండి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న వేళ ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభమైంది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లుపైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొవిడ్ టీకా మూడో డోసు ఇస్తున్నారు.
దిల్లీ, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ అర్హులైన వారంతా ఈ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు టీకా కేంద్రాలకు తరలివస్తున్నారు. మరి ఈ ప్రికాషన్ డోసు తీసుకునేవారు ఇవి గమనించండి.
కొత్తగా రిజిస్ట్రేషన్ వద్దు..
ప్రికాషన్ డోసు లబ్ధిదారులు ప్రత్యేకంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ్య పేర్కొంది. కొవిన్ పోర్టల్‌లోనే మొదటి డోసు, రెండో డోసుతో పాటు ప్రత్యేకంగా ప్రికాషన్ డోసు అనే ఆప్షన్ ఉంటుదని తెలిపింది.
సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు గడిచిన వారు.. ఈ ప్రికాషన్ డోసు కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అర్హులు వీళ్లే..
1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 2.75 కోట్ల 60 ఏళ్ల పైబడినవారు ప్రికాషన్ డోసు వేసుకోనున్నారని అంచనా. ప్రికాషన్ డోసు కింద గతంలో తీసుకున్న వ్యాక్సిన్నే ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కొవాగ్జిన్ తీసుకున్న వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి కొవిషీల్డ్‌నే ఇవ్వనున్నారు.
ఏ వ్యాక్సిన్ ఇస్తారు?
ప్రికాషన్ డోసుకు ప్రస్తుతం సరైన నిర్వచనం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు.. మూడో డోసుగా వేరే రకం వ్యాక్సిన్‌ను తీసుకోవడాన్ని ప్రికాషన్ డోసు అనొచ్చని కొవిడ్ వ్యాక్సినేషన్ సాంకేతిక బృందం అంటోంది. ఉదాహరణకు కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారికి మరో డోసుగా.. ఇతర వ్యాక్సిన్లు ఇస్తారు.
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి