PM Kisan: రైతులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగిచ్చేయండి
రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగేచ్చేయాలని ఆదేశించింది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇటీవల రైతుల ఖాతాల్లోకి విడుదల చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ఉత్తరప్రదేశ్ రైతులను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు యూపీ లోకల్ మీడియా కథనాలు ప్రచురించింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసేలోపు.. డబ్బులు తిరిగి చెల్లించాలని.. లేకుంటే నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని.. రైతులను అధికారులు.. ఆదేశించారు.
పీఎం కిసాన్ నిధి కింద.. 10వ విడతలో 7 లక్షల మంది లబ్ధి పొందారు. అయితే వారంతా.. నిబంధనల మేరకు అనర్హత పొందిన కారణంగా వారందరూ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రకటించినట్టు.. ఉత్తరప్రదేశ్ లోని లోకల్ మీడియా పేర్కొంది.
పీఎం కిసాన్ నిధిలో భాగంగా.. సుమారు 7 లక్షల మంది రైతులను అనర్హులుగా ప్రకటించినట్లు అర్థమవుతోంది. అయితే వీరంతా ఎక్కువ సంపాదనతో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని విచారణలో తేలిందని.. ఓ మీడియా సంస్థ తెలిపింది. ఈ పథకానికి అప్లే చేసిన వీరంతా డబ్బును తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
ఆదాయపు పన్ను కట్టే వాళ్లు సహా ఎక్కువ సంపాదన కలిగిన రైతులను ఈ పథకానికి అనర్హులు అవుతారని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు పీఎం కిసాన్ పథకం కింద పొందిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సమయం ఉంటుందని వెల్లడించారు. ఆ లోపు తిరిగి ఇవ్వకపోతే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.6 వేల చొప్పున జమ అవుతాయి. ఆ డబ్బును మూడు విడతలుగా రైతు బ్యాంకు ఖాతాలోకి వేస్తారు. నాలుగు నెలలకు ఒకసారి ప్రతి విడతగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం కింద 10వ విడతకు చెందిన డబ్బును జనవరి 1న విడుదల చేశారు.
Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
Also Read: Precautionary Covid Vaccine: దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు పంపిణీ.. ఈ విషయాలు తెలుసుకోండి!
Also Read: పిల్లాడిపై ఆ కోతులకు ఎందుకు పగ.. ఇంట్లో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లాయి.. అంతకుముందు ఇలానే..