Dragon Fruit Cultivation: మీ పొలంలోకి ఎంటర్ ది 'డ్రాగన్ ఫ్రూట్'... సాగుకు సబ్సిడీ 35 వేలు అందుకోవచ్చు
డ్రాగన్ ఫ్రూట్ మంచి పోషకాలు ఉన్న పండు. దీనికి గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది.
ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ వాడకం ఎక్కువైపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ.. కొన్ని ప్రాంతాల్లో రైతులు దీనిని పండిస్తున్నారు. అయితే దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇప్పటికే కొంమంది రైతుల దీనిని సాగుచేస్తున్నారు. గతేడాది నుంచి ఏపీ ప్రభుత్వం ఈ ఫ్రూట్ సాగుచేసే రైతులకు రూ.35 వేల సబ్సిడీ అందిస్తోంది. మెుత్తం 200 హెక్టార్లలో పంట సాగుచేయాలని.. సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు వితన్న ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే వీటని పెంచేందుకు రైతులకు పొలాల్లో సిమెంట్ లేదా రాతి స్తంభాలు అవసరమవుతాయి. దాదాపు 400 స్తంభాల వరకు అవసరం ఉండొచ్చు. వాటి నుంచి వచ్చే తీగలను స్తంభాల మీదకు వదలొచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు హెక్టారుకు రూ.35వేలు సబ్సిడీని అందజేస్తోందని పశ్చిమగోదావరి ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పాండురంగ తెలిపారు.
పంట వేసిన ఏడాదిలోపు పంట చేతికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుందని మరోవైపు రైతులు పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద జాతీయ రహదారి పక్కన ఎకరం విస్తీర్ణంలో నాయకంపల్లి గ్రామానికి చెందిన రైతు మాచిన రాంబాబు డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నాడు. ఆయన నవంబర్ 2020 లో మొక్కలను నాటాడు. అయితే 2021 మే నెలలో 500 కేజీల వరకు పంట దిగుబడి వచ్చినట్టు చెప్పాడు. కిలో పండ్లను రూ.300 చొప్పున అమ్మాడు. ఈ పండ్లను పెద్ద షాపింగ్ మాల్స్.. తదితర ప్రాంతాల్లో ప్యాక్ చేసి అమ్ముతారు. అంతకంటే ఎక్కువకు కూడా అమ్మేసుకోవచ్చని కొంతమంది రైతులు అంటున్నారు.
పోషకాలు కలిగిన డ్రాగన్‌ఫ్రూట్‌కు మార్కెట్‌లోనూ డిమాండ్ ఎక్కువగానే ఉంది. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్‌ఫ్రూట్ కొనేవారు ఎక్కువ అయ్యారు. ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.100 కూడా ఉంటుంది.
ఎకరాకు మొదట్లో రూ.6 లక్షలు ఖర్చవుతుందని, అయితే దిగుబడి 20 ఏళ్ల వరకు ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం.. రైతులకు విత్తనాలు లేదా మొక్కలు ఇస్తోందని, నర్సరీ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు చెబుతున్నారు. పంటను మార్కెటింగ్ చేయడంపైనా అధికారులు అవగాహన కల్పిస్తారు.
Also Read: Rain: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు..
Also Read: Mahabubabad: కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..