Khammam Floods | Public Fires on Ministers | ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సాయం చేయట్లేదంటూ జనాల ఆవేదన
Khammam Floods | Public Fires on Ministers | భారీ వర్షాలకు...వరద ఉద్ధృతికి ఖమ్మం జిల్లా అంతా అతలాకుతలం అవుతోంది. మరి ముఖ్యంగా ఖమ్మం పట్టణం మునిగిపోయింది. దీంతో.. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఐతే..జనాలు మాత్రం ఆశించిన మేర సహాయక చర్యలు అందట్లేదని సర్కార్ పై మండిపడుతున్నారు. పేరుకే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు తప్పా... కష్టాల్లో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ప్రజలు మంత్రులను తిడుతుంటే..! మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాత్రం కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే..! పాలేరులోని కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన ఇటుకలపని చేసుకునే యాకూబ్ వరద నీటిలో కొట్టుకుపోయింది. తన సొంత నియోజకవర్గమైన పాలేరులో ఓ కూలీ కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.