సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
సంధ్య థియేటర్ ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డిసెంబర్ 4 రాత్రి జరిగిన పుష్పా -2 ప్రీమియర్ షో కు హీరో వస్తున్నట్లు పోలీసుల అనుమతిని థియేటర్ యాజమాన్యం అంతకుముందే కోరినట్లు ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. హీరో, హీరోయిన్స్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని.. అందుకని వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి చిక్కడ్ పల్లి పోలీసులు సమాచారం వ్రాత పూర్వకంగా ఇచ్చారు. అయినా పోలీసుల మాట వినకుండా హీరో వచ్చారు. రావడమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ కూడా చేపట్టారు. హీరో రావడం తో ఒక్కసారి థియేటర్ లోకి అభిమానులు దూసుకెళ్లారు. ఈ ఘటనలోనే రేవతి సృహ కోల్పోయింది. వెంటనే రేవతి బాబు శ్రీ తేజ్ కు చిక్కడ్ పల్లి పోలీసులు సీపీఆర్ చేశారు. రేవతి మృతి విన్న తర్వాత అల్లు అర్జున్ ను పోలీసులు బయటకు పంపించారు. మళ్ళీ వెళ్లే టైంలో కార్ ఎక్కి ర్యాలీ ద్వారా అభిమానులకు అభివాదం చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీంతో అల్లు అర్జున్ కు నాంపల్లి 9 th మెట్రో పాలిటన్ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రీమాండ్ విధించింది. ఆ వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ బయట కు వచ్చిన సంగతి తెలిసిందే.