Heavy Rains in Hyderabad | మణికొండలో వర్షానికి కొట్టుకుపోయిన కారు
హైదరాబాద్ లో కుండపోత వర్షం పడింది. అయితే రాత్రి కురిసిన వర్షానికి జూబ్లీహిల్స్ కృష్ణానగర్ లో ఒక వ్యక్తి బైక్ తో పాటే కొట్టుకుపోయాడు. మణికొండలోని లాంకో హిల్స్‌లో రోడ్డుపై వేగంగా ప్రవహిస్తున్న నీళ్లలో కార్ ను తీసుకోని వెళ్ళడానికి ఒక వ్యక్తి ప్రయతించాడు. కానీ ప్రవాహంలో పడవలాగా కార్ కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
హైదరాబాద్ 5 ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. గచ్చిబౌలిలో 13.38 సె.మీ నమోదు కాగా సరూర్ నగర్ లో 12 సెంటీ మీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు అయింది. శ్రీ నగర్ కాలనీలో 12సెంటీమీటర్లు, ఖైరతాబాద్ ప్రాంతంలో 11.88, యూసఫ్ గూడలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ అయింది. భారీ వర్షంతో వెంటనే అపప్రమత్తమైన అధికారులు అలెర్ట్ జారీ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.





















