ED seize YS Reddy Assets | హైదరాబాద్ లో ఈడీ సోదాలు.. అడ్డంగా దొరికిన ముంబై అధికారి | ABP Desam
హైదరాబాద్ లో ఈడీ నిర్వహించిన సోదాల్లో భారీగా నోట్ల కట్టలు, వజ్రాలు, బంగారం వెలుగు చూశాయి. ముంబైలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా చేస్తున్న వైఎస్ రెడ్డి అనే అధికారి భారీగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కేసులో ముంబై, హైదరాబాద్ లో 13 ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో వైఎస్ రెడ్డి హైదరాబాద్ ఇంట్లో గుట్టలు గుట్టలుగా డబ్బు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. నోట్ల కట్టలు లెక్కలు పెట్టిన అధికారులు మొత్తం 9కోట్ల రూపాయులగా తేల్చారు. అంతే కాకుండా 23కోట్ల రూపాయలు విలువలైన వజ్రాలు, బంగారు బిస్కెట్లు, ఆభరణాలు సైతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. 2009లో ముంబైలోని వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు నిందితులతో కలిసి వైఎస్ రెడ్డి అనేక అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఈ వివరాలను ఈడీ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది.





















