Attack on Teenmar Mallanna Office | తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి
మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేసారు.
గత కొన్ని రోజుల నుంచి కవిత బీసీ రిజర్వేషన్లపై ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమం అంతా నాటకమేనని తీన్మార్ మల్లన్న తప్పుపట్టారు. కవితపై వ్యక్తిగతంగా తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారని జాగృతి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్న కార్యాలయంలోని ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ నేఫధ్యంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. దాడి జరిగినప్పుడు తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దాడి చేసిన వారి సమాచారం సేకరిస్తున్నారు. ఏసీపీ, సీఐ, మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వెళ్లి పరిశీలించారు. ఈ దాడుల్లో, గన్ మెన్ కాల్పుల్లో కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.





















