Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
IPL 2026 లీగ్... ఆఖరి లెగ్‌లోకి వచ్చేసినా ప్లే ఆఫ్ ఆడే నాలుగో టీమ్ ఏంట కన్ఫామ్ కాలేదు. ఆదివారం జరిగే రెండు లీగ్ మ్యాచ్‌లు ప్లేఆఫ్ లిస్టులో చివరి బెర్త్‌ను కన్ఫామ్ చేస్తాయి. అందులో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ - ముంబై ఇండియన్స్‌తో ఆడుతోంది. ఇప్పటికే అస్సాం టికెట్ తీసుకుని బయటకెళ్లిపోయిన ముంబైకి ఈ మ్యాచ్‌తో వచ్చేది పోయేదేం లేదు. కాకపోతే సొంత గ్రౌండ్‌లో పరువు నిలుపుకోవడానికి .. పాయింట్స్ టేబుల్‌లో మరీ అట్టగున లేకుండా ఉండటానికి మాత్రమే తాపత్రయం. కానీ రాజస్థాన్‌కు అాలా కాదు. ఈ మ్యాచ్ వాళ్లకి Do or Die. ఈ మ్యాచ్‌లో గెలిస్తే... వాళ్లు ప్లే ఆఫ్‌కు వెళతారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ తమ ఆశలన్నంటినీ 15ఏళ్ల వైభవ్ పైన పెట్టుకుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో రాజస్థాన్ ఈ మాత్రం నిలబడగలిగిందంటే అతని వల్లనే. మొత్తం టీమ్ అతనిపైన డిపెండ్ అయిందన్న విషయం వినడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కానీ... స్టాటిస్టిక్స్ చెబుతోందదే. RR గెలిచిన మ్యాచ్‌లలో నాలుగోవంతు పరుగులు వైభవ్ చేసినవే. అతను ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 579పరుగులు చేశాడు. అందులో 344పరుగులు RR గెలిచిన 7 మ్యాచ్‌లలో చేశారు. అంటే సగటు దాదాపు 50పరుగులు. అంతే కాదు.. RR మొత్తం పరుగుల్లో వైభవ్ చేసినవి 26శాతం పరుగులు. సో... దీనిని బట్టే వైభవ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. గెలిచిన మ్యాచ్‌లలో మాత్రమే కాదు... RR ఓడిపోయిన వాటిలో వైభవ్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ౩6 బంతుల్లోనే సెంచరీ కొట్టిన మ్యాచ్‌ను RR బౌలర్లు కాపాడలేకపోయారు.
ట్రెండింగ్ వార్తలు






















