Team India Passed YoYo and Bronco tests
టీమిండియా ప్లేయర్లంతా తప్పనిసరి ఇవ్వాల్సిన యోయో, బ్రాంకో టెస్ట్‌లకి విరాట్ కోహ్లీ కంప్లీట్‌గా ఆబ్సెంట్ అవ్వడం.. ఇంకో పక్క కోచ్ గంభీర్ ప్లాన్స్‌పై నీళ్లు చల్లుతూ రోహిత్ శర్మ ఈ టెస్ట్‌లో షాకింగ్ రిజల్ట్ తెచ్చుకోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్లేయర్స్‌కి ఆదివారం నాడు యోయో అండ్ బ్రాంకో టెస్ట్‌లు కండక్ట్ చేసింది బీసీసీఐ. బెంగళూరులోని బీసీసీఐ సెంట్ర్ ఎక్స్‌లెన్స్ సెంటర్లో ఈ టెస్ట్‌లు జరిగాయి. అయితే కొద్ది రోజుల క్రితం వరకు టీమిండియా ప్లేయర్లు కేవలం యోయో టెస్ట్ పాస్ అయితే సరిపోయేది. కానీ.. ఈ మధ్యనే ఫిట్ నెస్ కోచ్ ఆడ్రియన్ సలహాతో రగ్బీ ప్లేయర్లకి కండక్ట్ చేసే బ్రాంకో టెస్ట్‌ని కూడా టీం ప్లేయర్లకి మాండేటరీ చేశాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇది చాలా టఫ్ టెస్ట్ కావడం.. 100 పర్సెంట్ ఫుల్ ఫిట్‌నెస్ ఉన్న ప్లేయర్లు మాత్రమే ఈ టెస్ట్ పాస్ అయ్యే ఛాన్స్‌లు ఉండటంతో.. టీమిండియాలో సీనియర్ ప్లేయర్, కొద్దిగా ఫిట్‌నెస్ సమస్యలున్నట్లు కనిపించే రోహిత్ శర్మని టీమ్ నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశంతోనే కోచ్ గంభీర్ ఈ టెస్ట్‌ని తీసుకొచ్చాడని ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో మనోడిని ఓ ఆట ఆడేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఆదివారం జరిగిన ఈ టెస్ట్‌లో రోహిత్ శర్మ చాలా ఈజీగా పాస్ అయిపోయాడట. అది కూడా ఫస్ట్ క్లాస్ మార్కులతో హిట్ మ్యాన్ ఈ టెస్ట్ పాస్ కావడంతో.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో కోచ్ గంభీర్‌ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ టెస్ట్‌లో టాప్ ప్లేస్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కొట్టేశాడట. అయితే ఇక్కడ అందరికీ షాకిచ్చిన ఇంకో న్యూస్ ఏంటంటే.. విరాట్ కోహ్లీ ఈ టెస్ట్‌లకి అటెండ్ కాలేదట. ఎందుకు రాలేదనే విషయం క్లారిటీగా తెలియకపోయినా.. ఇప్పుడు జరగబోతున్న ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగుతుండటం.. టీ20, టెస్ట్ ఫార్మాట్లకి కోహ్లీ ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఉండటంతో పాటు కొంత కాలం క్రికెట్‌కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని డిసైడ్ కావడంతోనే ఈ టెస్ట్‌కి అటెండ్ కాలేదని తెలుస్తోంది. మరి రోహిత్ బ్రాంకో టెస్ట్ పాస్ కావడం.. కోహ్లీ ఆబ్సెంట్ కావడం.. ప్రసిద్ధ్ కృష్ట టాప్ ప్లేస్ కొట్టేయడంపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.



















