Ricky Ponting Prediction T20 World Cup Abhishek Sharma | అభిషేక్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కు ( ICC T20 World Cup 2026 ) టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. యంగ్ టీమ్ తో ప్రపంచ కప్ ఆడనున్న భారత్ పై ఎన్నో ఆశలు నెలకొన్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) సంచలనం సృష్టించాడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్ పై మాజీ దిగ్గజ క్రికెటర్ ప్రశంశలు కురిపిస్తున్నారు.
అభిషేక్ శర్మ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మాత్రమే కాకుండా, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా సొంతం చేసుకుంటాడని అన్నారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ( Ricky Ponting ). “నిజం చెప్పాలంటే, అనుభవం లేకపోవడం అనేది తనకి ఒక పాజిటివ్ థింగ్. అతను అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది” అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
“అభిషేక్ అంతటి ప్రతిభావంతుడని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తను రాణిస్తే భారత్‌ను ఓడించడం ఎవరికైనా కష్టమవుతుంది. కానీ విఫలమైతే, భారత్ కూడా మిగతా టీమ్స్ లాగానే ఒత్తిడికి లోనవుతుంది. అందుకే ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున అభిషేక్ చాలా కీలకమైన ప్లేయర్" అంటూ అభిషేక్ ను పొగిడారు పాంటింగ్.
ట్రెండింగ్ వార్తలు






















