Pat Cummins Hat tricks in Worldcup | ప్రపంచ క్రికెట్‌లో ప్యాట్ కమిన్స్ రికార్డు | ABP Desam
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. కానీ ప్యాట్ కమిన్స్ మాత్రం ఇంతకు ముందు ఎవ్వరూ సాధించని ఒక రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌ల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. ఈ రికార్డును ప్యాట్ కమిన్స్ ఒకే టీ20 వరల్డ్ కప్‌లో సాధించడం గ్రేట్ అని చెప్పవచ్చు. నేడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌తో పాటు ఇంతకు ముందు జూన్ 21వ తేదీన జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కూడా ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. మొత్తం ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. 1999లో వసీం అక్రమ్ వరుసగా రెండు టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డు సాధించిన రెండో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ చరిత్రకెక్కాడు. టీ20ల వరకు చూసుకుంటే మాత్రం ప్యాట్ కమిన్స్‌దే ఈ రికార్డు. 1912లో ఆస్ట్రేలియాకే జిమ్మీ మాథ్యూస్ ఒకే టెస్టుల్లో రెండు హ్యాట్రిక్స్ తీసుకున్నాడు. కానీ అది వరుస మ్యాచ్‌ల లెక్కలోకి రాదు.