India vs England Test Match Highlights | టెన్షన్ పెడుతున్న వెదర్ రిపోర్ట్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్‌లో 427 స్కోరు చేసి డిక్లేర్ చేసింది టీం ఇండియా. దాంతో ఇంగ్లాండ్ టార్గెట్ 608 పరుగులకు చేరింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండ్ ఇంకా 536 పరుగులు చేయాలి. ఒక రోజు అట.. 7 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ మొదలయ్యాక ఓపెనర్ జాక్ క్రాలేని సిరాజ్ డకౌట్ చేశాడు. బెన్ డకెట్‌ని ఆకాశ్ దీప్ అవుట్ చేశాడు. జో రూట్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇండియాపై సింగిల్ డిజిట్ స్కోర్ తో జో రూట్ అవుట్ అవడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి. ఇండియా గెలవాలంటే బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కనబర్చాలి.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఐదో రోజు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తుంది. అలాగే ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఇండియా గెలవలేదు. ఇప్పటివరకూ జరిగిన 8 మ్యాచ్‌లలో 7 సార్లు టీమ్ ఇండియా ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. వర్షం పడితే ఇంగ్లండ్‌కు కలిసొస్తుంది. వర్షం కారణంగా ఒక సెషన్ మ్యాచ్ జరగకపోతే ... మ్యాచ్‌ను డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది. తక్కువ ఓవర్లతో కూడా మ్యాచ్ జరగడానికి అవకాశాలున్నాయి. ఆలా చేస్తే ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయడం కష్టమవుతుంది. మరి ఈ మ్యాచ్ టీం ఇండియా గెలవడానికి వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.





















