Gambhir Celebration After Winning Match | మ్యాచ్ గెలవడంతో గంతులేసిన గంభీర్
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఇండియా గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎగిరి గంతులు వేసాడు. డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ సెలెబ్రేషన్స్ వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సిరాజ్ ఆఖరి వికెట్ తియ్యగానే గంభీర్ జంప్ చేస్తూ తన స్టాఫ్ ని హాగ్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్ లో గంభీర్ శుభమాన్ గిల్ ను హాగ్ చేసుకున్నారు.
ఇటీవల కాలంలో గంభీర్ కోచ్ గా టెస్ట్ ఫార్మాట్ లో ఇబ్బందులు ఎదుర్కున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైట్‌వాష్, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. దాంతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చాలా కీలకంగా మారింది. ఇలాంటి టైం లో ఓడిపోకుండా సిరీస్ ను డ్రా చేసుకోవడం గంభీర్ కు పెద్ద రిలీఫ్.
సిరీస్ ముగిసిన తర్వాత గిల్ మాట్లాడుతూ, ఈ సిరీస్ ప్రారంభానికి ముందు గంభీర్ తమతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నారు. “మనం యువ జట్టు కావచ్చు, కానీ మనం యువ జట్టులా కనిపించకూడదు. మనం ఒక ‘గన్ టీమ్’లా కనిపించాలి” అని గంభీర్ టీం ను ప్రోత్సహించినట్లు గిల్ వెల్లడించారు. మ్యాచ్ తర్వాత గంభీర్ X వేదికగా స్పందించారు. “మేం కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. కానీ ఎప్పుడూ లొంగిపోం! వెల్ డన్ బాయ్స్ అంటూ పోస్ట్ చేశారు.





















