T20 WC 2022 1st Semi Final Nz vs Pak : వరల్డ్ కప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ నేడే
టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ఫైనల్ బెర్త్ ఎవరిది. ఈ రోజు మ్యాచ్ లో తేలిపోతుంది. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్. ఒక టీమ్ అన్ సెర్టినిటీకి కేరాఫ్ అడ్రస్... ఇంకో టీమ్ కనిస్టెన్సీకి ల్యాండ్ మార్క్. న్యూజిలాండ్ సెమీస్ కు రావటానికి చాలా మంచి మ్యాచ్ లు ఆడింది. కానీ పాకిస్థాన్ సెమీస్ కు వస్తుందని సౌతాఫ్రికా నెదర్లాండ్స్ మీద ఓడిపోయేంత వరకూ వాళ్లకు కూడా తెలియదు. మరి ఇలాంటి రెండు టీమ్స్ మధ్య జరగనున్న ఫస్ట్ సెమీస్ మ్యాచ్ లో విజేతలెవరు అనేది ఫుల్ టెన్షన్ ను పెంచేస్తోంది. కివీస్ కొంచెం హాట్ ఫేవరేట్ లా కనిపిస్తోంది కానీ పాకిస్థాన్ ఎప్పుడూ అంచనాలకు అందదు. సో ఎవరి బలం ఏంటీ ఈ మ్యాచ్ ఎలా జరిగే అవకాశం ఉంది ఈ ప్రివ్యూలో చూద్దాం.





















